Home

»

Latest News

దాస‌రి నోట‌.. చైతూ ప్రేమ మాట‌

Sep 21, 2016 11:52AM

నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రేమ‌మ్ ఆడియో ఫంక్ష‌న్ లో దాస‌రి నారాయ‌ణ రావు స్పీచే హైలెట్ అనిచెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయ‌న నోటి నుంచి చైతూ ప్రేమాయాణం మ‌రోసారి బ‌య‌ట ప‌డిపోయింది. నాగ‌చైత‌న్య - స‌మంత ప్రేమ‌లో ఉన్న‌ట్టు.. వాళ్లిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని అభిమానుల స‌మ‌క్షంలో నాగ్‌, చైతూలు ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. ప్రేమ‌మ్ ఆడియో ఫంక్ష‌న్‌లో ఈ ప్రేమ క‌బురు అభిమానుల‌కు అంద‌రిస్తారనుకొన్నారంతా.

అయితే.. వాళ్ల నోటి నుంచి ఈ మాట‌లేం రాలేదు. చిత్రంగా దాస‌రి నారాయ‌ణ రావు నాగ‌చైత‌న్య ప్రేమ గురించి మాట్లాడి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.చైతూ న‌వ్వుల‌తోనే మాయ చేస్తాడ‌ని, అలా మాయ‌చేసే ఆ హీరోయిన్‌ని ప‌డేశాడ‌ని చ‌మ‌త్క‌రించారు దాస‌రి. ఆ హీరోయిన్ కూడా ఏం మాయ చేశావెతో మాయ చేసింద‌ని ఓ హింటు ఇచ్చారు కూడా. దాంతో ఆడిటోరియం మొత్తం ఘొల్లుమంది. ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి స‌మంత కూడా వ‌స్తుందేమో అని అంతా ఎదురుచూశారు. కానీ స‌మ్మూ రాక‌పోవ‌డం, నాగ్ తొంద‌ర తొంద‌ర‌గా స్పీచ్ ముగించుకొని వెళ్లిపోవ‌డం కాస్త నిరాశ‌కు గురి చేసింది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com