![]() |
![]() |

కళాదర్బార్ వ్యవస్థాపకులు, కళాసామ్రాట్ పొత్తూరి రంగారావు (Potturi Rangarao) డాక్టరేట్ ను పొందారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. సాంస్కృతిక రంగంలో రంగారావు చేసిన సేవలను గుర్తించిన అమెరికన్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను అందించింది.
పొత్తూరి రంగారావు ఐదు దశాబ్దాలుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందరో సినీ ప్రముఖులను సన్మానించారు. పలువురు సినీ దిగ్గజాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు ఇప్పటికే ఎన్నో అవార్డులు, బిరుదులు పొందారు. ఇప్పుడు డాక్టరేట్ ను అందుకున్నారు.

![]() |
![]() |