Home

»

Latest News

త్రివిక్రమ్ ని ప్రశ్నించండి.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

Sep 17, 2024 6:39PM

ప్రస్తుతం టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ ఛాంబర్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. (Poonam Kaur)

గతంలో తాను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని పూనమ్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని కోరుతున్నట్లు పూనమ్ పేర్కొన్నారు.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా కూడా పూనమ్ స్పందించారు. తనకి సినీ పరిశ్రమ సెట్ కాదని, ఇప్పటిదాకా సినిమా అవకాశాల కోసం ఏ దర్శకుడిని గానీ హీరోని గానీ అప్రోచ్ కాలేదని అన్నారు. దర్శకుడు మరియు రాజకీయాల వల్ల తన కెరీర్ తో పాటు జీవితం కూడా నాశనమైందని పూనమ్ రాసుకొచ్చారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com