Home  »  News  »  People Media Factory: అప్పుడే అయిపోయిందనుకోకు, ఇప్పుడే మొదలైంది.. 2027 కి పక్కా ప్లానింగ్ 

Updated : Apr 20, 2026

 

 

-రాజా సాబ్ తో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డీలా!
-కానీ 2027 లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ 
-పవన్ కళ్యాణ్ తో కలిసి కూడా చిత్రాలు 
-లైనప్ ఇదేనా!

ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది నిర్మాతలకే ప్రత్యేకమైన క్రేజ్ అనేది ఏర్పడుతుంది.  అటువంటి అరుదైన నిర్మాతల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad)ఒకరు. సినిమాపై మక్కువతో విదేశాల నుంచి వచ్చి మరి సినిమాలని నిర్మిస్తున్నారు. కుమార్తె కీర్తి ప్రసాద్(Keerthi Prasad)ని కూడా భాగస్వామ్యం చేసుకొని మరి ముందుకు దూసుకెళ్తున్నారు. అటువంటి సినీ అభిలాషి అయిన విశ్వప్రసాద్ అప్పుడే అయిపోయిందనుకోకు, ఇప్పుడే మొదలైంది అనేలా తన లైనప్ ని సెట్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం

పీపుల్ మీడియా  ఫ్యాక్టరీ కి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ ఊహించని పరాజయాన్ని అందించింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా కట్ అవుట్ ఉన్నా 100 కోట్ల రూపాయల నష్టం మేరకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో విశ్వప్రసాద్ పని అయిపోయిందని కొంత మంది కుహనా శక్తులు చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేసాయి. కానీ పీపుల్ మీడియా లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ.  2027 సంవత్సరాన్ని టార్గెట్ చేస్తూ ఈ సంస్థ ఒక భారీ లైనప్‌ను సిద్ధం చేస్తోంది.గత ఏడాది తేజ సజ్జ తో 'మిరాయ్' తెరకెక్కించి  హిట్  కొట్టగా ఇప్పుడు ఒక భారీ ఫిక్షన్ అండ్  యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. 'రాయలసీమ నుండి ప్రపంచం చివరి వరకు' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అడివి శేష్ గూఢచారి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆద్వర్యంలోని పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ తో  కలిసి మూడు చిత్రాలను నిర్మించేందుకు సిద్దమవుతుండటంతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలోఉన్నాయి. ఈ చిత్రాలన్నీ కూడా 2027లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

also read: Chiranjeevi: SP కి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

మరి ఈ స్పీడ్ చూస్తుంటే విశ్వప్రసాద్ గతంలోనే ప్రకటించినట్లుగానే వంద సినిమాల మార్కుని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తుంది. ఇక విశ్వప్రసాద్ పని అయిపోయిందని చెవులు కోరుకునే వాళ్ళకి మరి తెలుసో లేదో , ప్రభాస్ మరో సినిమా చేస్తాడని మాట ఇచ్చాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా  జరుగుతున్నాయనేది ఫిలిం సర్కిల్స్ లో ఫ్రెష్ టాక్. 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.