Home  »  News  »  Peddi: నీ అయ్య వడ్డీ, నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే.. వైరల్ గా మారిన ట్వీట్ 

Updated : Feb 26, 2026

 

-ఆ ట్వీట్ చరణ్ చేశాడా 
-సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది 
-అసలు వాస్తవం ఏంటి!

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' (Ram Charan)చూపు ఈ సారి పాన్ ఇండియా రికార్డ్స్ వైపు ఉంది. ఈ విషయంలో ఎవరు డౌట్స్ పెట్టుకొని విధంగా పెద్ది నుంచి ఇప్పటి వరకు వచ్చిన చరణ్, జాన్వీ కపూర్(Janvi Kapoor),శివరాజ్ కుమార్, జగపతి బాబు లుక్స్, టీజర్  చరణ్ మనసులో ఉన్న  విషయాన్నీ నొక్కి మరి చెప్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా చికిరి సాంగ్ అయితే పైన చెప్పుకున్న ప్లస్ లన్నింటిని ఓవర్ టేక్ చేసింది. ఒక్క తెలుగు లిరికల్ వీడియోనే స్టిల్ 175 మిలియన్స్ ని రాబట్టడమే ఓవర్ టేక్ కి నిజ నిర్దారణ. మరి ఇప్పుడు సెకండ్ సింగిల్   కూడా సింహం సింగల్ గా రాబోతుంది. ఈ విషయంపై చరణ్ ఎక్స్ వేదికగా ఏం చెప్పాడో చూద్దాం.

రీసెంట్ గా చరణ్ ఎక్స్ వేదికగా 'రై రై రారా రై రై రారా' అనే సాంగ్ నెక్స్ట్ మంత్ సెకండ్ న రిలీజ్ అవుతుందని చెప్పాడు. అలా ట్వీట్ చేసాడో లేదో పూర్తి డీటెయిల్స్ కోసం సెర్చ్ చేయగా చిత్ర యూనిట్ కూడా మార్చి 2 సాంగ్ విడుదల చేయబోతున్నాం. 'నీ అయ్య వడ్డీ.. నీ బిడ్డ కడితే.. నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా'' అనేది  పూర్తి లిరిక్ అని తెలిపింది. ఇప్పుడు సదరు లిరిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారడంతో పాటు ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ అప్పుడే వాళ్ళ స్టైల్లో ట్యూన్స్ కట్టుకుంటూ పాడుకుంటున్నారు. నెటిజన్స్ కూడా ట్యూన్ విషయంలో ట్రై చేస్తు చికిరి కంటే ఊర విలేజ్ టైప్ లో సాంగ్ ఉండబోతుందని అర్దమవుతుంది.వెయిటింగ్ అంటు కామెంట్స్ చేస్తున్నారు.


also read: The kerala story part 2: రిలీజ్ పై హైకోర్ట్ సంచలన తీర్పు .. రేపే రిలీజ్ 

ఉత్తరాంధ్ర భావజాలం, బాడీ లాంగ్వేజ్ తో తెరకెక్కుతున్న 'పెద్ది' ని బుచ్చిబాబు(Buchi Babu)ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 . వృద్ధి సినిమాస్ నిర్మాణ సంస్థ కాగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ అండదండలు పెద్దికి ఉన్నాయి. ఒక కాలు పని చేయని అవిటి వ్యక్తిగా చరణ్ కనిపించబోతున్నాడనేది ప్రధాన రూమర్.   

 

  https://x.com/AlwaysRamCharan/status/2026965412068634860?s=20

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.