![]() |
![]() |
.webp)
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి పవన్ కళ్యాణ్ హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీరి సరదా సంభాషణ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఇప్పుడు ఇరు హీరోల ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వీర సింహా రెడ్డి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సెట్స్ లో పవన్ సందడి చేశాడు. మైత్రి బ్యానర్ లో పవన్ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో 'వీర సింహా రెడ్డి'లోని చివరి సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా పవన్ ఆ మూవీ సెట్స్ ని సందర్శించి మూవీ టీమ్ ముచ్చటించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బాలయ్య, పవన్ తో పాటు మైత్రి నిర్మాతలు ఉన్నారు. బాలయ్య, పవన్ కలిసిన ఫోటోకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. ఇక 'అన్ స్టాపబుల్' షోలో వీరిద్దరూ సందడి చేస్తే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు.
![]() |
![]() |