![]() |
![]() |

నరేష్ గారు మీరు అనవసరంగా తొందరపడ్డారు..వర్సటైల్ యాక్టర్ హోదాలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. అసలు మీరు పూర్తి వీడియోని చూడలేదు. ఇప్పుడు ఈ మాటలన్నీ సీనియర్ యాక్టర్ నరేష్ ని ఉద్దేశించి పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడాడు.. పవన్ ఫ్యాన్స్ కి నరేష్ తో ఏం పని
తెలుగు సినిమాకి కొత్త సువాసనని అద్దిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో కొన్ని లక్షలాది మంది అభిమానులని సంపాదించాడు.ఆ అభిమానం జనసేన పార్టీ స్థాపించేదాకా వెళ్లిందంటే ఆయన స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సూపర్ కృష్ణ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. వీటిపై సోషల్ మీడియా వేదికగా నరేష్ తన స్పందనని తెలియచేసాడు. కృష్ణ గారిని పవన్ విమర్శించడం బాగోలేదంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ విషయంపైనే పవన్ ఫ్యాన్స్ నరేష్ కి రిప్లై ఇస్తున్నారు. నరేష్ గారు మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోని పూర్తిగా చూడలేదు. ఎవరో ఏదో చెప్తే నమ్మకండి.
దివంగత నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ గారు ఆయన్ని వ్యతిరేకించారు. అయినా జగన్మోహన్ రెడ్డిలా ఎన్టీఆర్ గారు కృష్ణ గారి సినిమాలని అడ్డుకోలేదు. అంతటి గొప్ప సంస్కారవంతుడు ఎన్టీఆర్ అని పవన్ చెప్పాడు. అంతే గాని కృష్ణ గారిని పవన్ ఎక్కడా విమర్శించలేదు. పైగా పవన్ చెప్పిన మాటలనే గతంలో కృష్ణ గారు కూడా చెప్పారని గుర్తు చేస్తూ కృష్ణ గారి వీడియోని కూడా రిలీజ్ చేసారు. ఈ మ్యాటర్ మొత్తం మీద అసలు కొసమెరుపు ఏంటంటే పవన్ మంచి నాయకుడిని ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు అని నరేష్ పొగడడం గమనార్హం. ఇక వైసీపీ ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ముందుకు దూసుకుపోతున్నాడు. నరేష్ బిజెపి లో ఉన్నాడు.
![]() |
![]() |