Home  »  News  »  నాని ‘ది ప్యారడైజ్’ బ్లాస్టింగ్ అప్‌డేట్.. కొత్త రిలీజ్ డేట్‌తో మాస్ టీజర్.!

Updated : Jul 27, 2026

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'దసరా' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ గా నిలవడంతో, ఈ సరికొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సికింద్రాబాద్ బస్తీల నేపథ్యంలో నానిని మునుపెన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో, రెండు జడల హెయిర్‌స్టైల్ తో పవర్‌ఫుల్ లీడర్‌గా చూపించబోతున్న ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రం నుంచి త్వరలోనే ఒక పవర్‌ఫుల్ మాస్ టీజర్ విడుదల కాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ఈ టీజర్‌లోనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాని పలికే డైలాగులు, ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 

‘ఆయా షేర్’ సాంగ్ ఏకంగా 20 కోట్ల (200 మిలియన్) వ్యూస్ మైలురాయిని దాటి సంచలనం సృష్టించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మాస్ టీజర్ ప్రకటనను అందించారు.

భారీ బడ్జెట్‌తో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని సరసన కాయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి, బాబు మోహన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

‘ది ప్యారడైజ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో రాబోయే ఈ బ్లాస్టింగ్ టీజర్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త అలజడి సృష్టించేందుకు నాని బృందం సిద్ధమవుతోంది. ఆ పవర్‌ఫుల్ విజువల్స్, మాస్ డైలాగ్స్ తో పాటు ప్రకటింపబోయే కొత్త విడుదల తేదీ కోసం నేచురల్ స్టార్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

 

The Paradise Teaser, Nani, Srikanth Odela, Aaya Sher

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.