![]() |
![]() |
.webp)
సినిమా పరిశ్రమలో మెగాబ్రదర్ నాగబాబు(nagababu)కి ఉన్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపుని పొందాడు. ప్రస్తుతం తన సోదరుడు పవన్ కళ్యాణ్(pawan kalyan)స్థాపించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలని సమర్దవంతంగా నిర్వహిస్తూ ఉన్నాడు.
ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)రీసెంట్ గా ఒక లేఖని విడుదల చేస్తు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా వెల్లడి చెయ్యడం జరిగింది.దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. నాగబాబుకి ఏ శాఖ కేటాయిస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది.
![]() |
![]() |