Home

»

Latest News

గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడం తప్పు..మహేష్ ఫ్యాన్స్ తో ఆటలొద్దు

Oct 14, 2024 12:43PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)దర్శకుడు త్రివిక్రమ్(trivikram)ల కాంబోలో గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ గుంటూరు కారం(guntur kaaram)మూవీ టాక్ సంగతి ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లోనే వసూలు చేసి మహేష్ స్టామినాని మరోసారి చాటి చెప్పింది.హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ,సూర్యదేవర నాగవంశీ(naga vamsi)లు నిర్మాతలుగా వ్యవహరించగా మహేష్ సరసన శ్రీలీల(sreeleela)మీనాక్షిచౌదరి(meenakshi chaudhary)జత కట్టారు. 

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో గుంటూరు కారం గురించి నాగవంశీ మాట్లాడుతూ గుంటూరు కారం మా అందరి బాగా నచ్చిన సినిమా.కంటెంట్ పరంగా మూవీలో ఎలాంటి తప్పూ లేదు.కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అన్ని ఏరియాల్లో బాగానే సక్సెస్ అయినా కూడా నైజాంలో మాత్రం డ్యామేజ్ అయింది.అలాగే  ఫ్యామిలీ మూవీకి గుంటూరు కారం అనే  మాస్ టైటిల్ ని పెట్టడం ఒక  తప్పు అని నేను భావిస్తున్నాను.పైగా మిడ్ నైట్ ఒంటి గంటకే షోస్ వేయడం కూడా తప్పు అయి ఉండవచ్చని  నాగవంశీ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు మహేష్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడో అయిపోయిన విషయాన్నీ ఇప్పుడెందుకు చెప్పడమంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగానే  గుంటూరు కారం అనే టైటిల్ బాగుందని కూడా అంటున్నారు. గుంటూరు కారం రిలీజ్ టైం లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు సినిమా హిట్ అని,కలెక్షన్స్  అందుకు సాక్ష్యమని  సోషల్ మీడియా వేదికగా మహేష్ ఫ్యాన్స్ ఎంతగా పోరాడారో తెలిసిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com