![]() |
![]() |

తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అధికారుల చర్యను ఇప్పటికే నాగార్జున తప్పుబట్టారు. పట్టా భూమిలోనే భవన నిర్మాణం చేశామని, ఒక్క సెంట్ కూడా చెరువుని ఆక్రమించలేదని తెలిపారు. తాజాగా ఈ విషయంపై నాగార్జున కుమారుడు, సినీ హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. (N convention demolition)
తాజాగా తస్వా స్టోర్ ఓపెనింగ్ కి నాగ చైతన్య హాజరు కాగా.. ఆయనను ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. దానిపై స్పందించిన చైతన్య.. "ఇప్పుడు దాని గురించి ఎందుకండీ. ఇప్పటికే నాన్న దాని గురించి అఫీషియల్ గా ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యారు. అన్ని వివరాలు చెప్పారు. ప్రస్తుతానికి దాని గురించి వద్దు. తర్వాత మాట్లాడదాం." అని అన్నాడు.
నాగ చైతన్య ఎక్కడా నోరు జారకుండా.. తన తండ్రి స్పందించారంటూ, వివాదాల జోలికి పోకుండా తెలివిగా తప్పించుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |