![]() |
![]() |

తెలుగు స్టార్ హీరోస్ లో నాగార్జున కూడా ఒకడు. సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరో అని అనిపించుకున్న రికార్డు కూడా ఆయన సొంతం. అభిమానులందరు ముద్దుగా కింగ్, యువ సామ్రాట్, మన్మధుడు లాంటి పేర్లతో పిలుచుకుంటారు.తన ముప్పై ఎనిమిదేళ్ల సినీ జీవితంలో చాలా మంది హీరోలు పోషించడానికే భయపడే క్యారెక్టర్స్ ని చాలా అవలీలగా పోషించారు.అంతే కాకుండా సదరు క్యారెక్టర్స్ ని ప్రేక్షకుల దృష్టిలో సజీవంగా నిలబడేలా కూడా చేసాడు. తాజాగా నాగ్ గురించి వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.
నాగ్ మొన్న సంక్రాంతికి నా సామిరంగ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ టాక్ తో ఆ మూవీ మంచి విజయాన్నే అందుకుంది. అభిమానులైతే చాలా సంవత్సరాల తర్వాత వింటేజ్ నాగార్జున ని చూశామనే అనుభూతిని కూడా పొందారు. ఇక ఈ మూవీ ఇప్పుడు టీవీల్లో ప్రసారం కానుంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్ స్టార్ మాలో మార్చి 24 వ తేదీన సాయంత్రం ఆరు గంటలకి టెలికాస్ట్ కానుంది. ఈ వార్త నాగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్ని కూడా ఆనందంలో ముంచెత్తుతుంది.

నా సామి రంగ ప్రస్తుతం ఓటిటి వేదికగా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతు ఉంది. అలాగే రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని కూడా సంపాదిస్తుంది. రేపు టెలివిజన్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. నాగార్జున కి జోడిగా ఆషికా రంగనాద్ నటించింది. వీళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా పండింది. వాళ్ళ క్యారెక్టర్స్ డిజైన్ కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కట్టిపడేసింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రావు రమేష్, నాజర్ తదితరులు చాలా చక్కగా నటించారు యువ హీరోయిన్లు రుక్సార్ థ్రిల్లన్, మిర్న మీనన్ లు కూడా మంచి క్యారెక్టర్స్ లో మెరిశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా రోజర్ బిన్నీ దర్శకత్వాన్ని వహించాడు.
![]() |
![]() |