Home

»

Latest News

NBK112 బిగ్ అప్డేట్: బాలయ్య-కొరటాల మూవీ ఆగిపోయిందా.. అసలు నిజమేంటి.?

Aug 18, 2026 10:47AM

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం #NBK112 ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బడ్జెట్ సమస్యలు, హీరో-డైరెక్టర్ మధ్య సింక్ కుదరలేదంటూ వస్తున్న రూమర్లపై తాజాగా మూవీ టీమ్ అధికారికంగా స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ అనగానే.. అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. బాలయ్య మాస్ పవర్, కొరటాల మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సోషల్ మెసేజ్ కలిస్తే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. 

కానీ గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అమరావతిలో ఎంతో అట్టహాసంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ #NBK112 ప్రాజెక్ట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల, అలాగే బాలయ్య - కొరటాల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల పూర్తిగా ఆగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలు విన్న నందమూరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందా అనే చర్చలే జరుగుతున్నాయి. 

అయితే, ఈ వైరల్ రూమర్లపై 'Team NBKKoratalaSiva' అఫీషియల్‌గా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రాజెక్ట్ ఆగిపోలేదని స్పష్టం చేసింది. అభిమానులు ఎలాంటి నిరాధారమైన అసత్య ప్రచారాలను, రూమర్లను నమ్మవద్దని కోరింది.

ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK111' ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ 'NBK111' షూటింగ్ పూర్తి కాగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'NBK112' వెంటనే సెట్స్ పైకి వెళ్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. దాంతో బాలయ్య - కొరటాల ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. 

 

 

 

Nandamuri Balakrishna, Koratala Siva, NBK112 Movie

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com