Home  »  News  »  హ్యాండ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్.. ఫ్యాన్స్ డిజప్పాయింట్ 

Updated : Jul 28, 2026

 

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel), పాన్ ఇండియా మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers). ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే సినీ ప్రియుల్లో ఉండే ఆసక్తే వేరు. అందుకే అందరూ ఎంతో ఆసక్తితో హారర్ థ్రిల్లర్ '418' ది ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహిస్తుండగా    సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగాడల్ ముఖ్యమైన క్యారక్టర్ పోషిస్తున్నారు. తాజాగా అభిమానులకి  మైత్రీ సంస్థ ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది.


సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన  పోస్టర్‌లో "భయంకరమైన తలుపులు కొద్దిగా ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూలై 31, 2026న విడుదల కావాల్సిన '418 ద ఫిల్మ్' ఆ రోజు రావడం లేదు. అతి త్వరలోనే నూతన విడుదల తేదీని మీ ముందుకు తీసుకువస్తాం. మీ సహనానికి, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమనంతటినీ మరింత భయం రూపంలో మీకు తిరిగి ఇవ్వడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ ఎదురుచూపు ఖచ్చితంగా సరైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు హారర్ సినిమాలను చూసి నవ్వింది చాలు.. ఇకపై భయపడాల్సిన సమయం వచ్చింది" అని కోట్ చేస్తూ #MythriBringsHorror అనే హ్యాష్‌ట్యాగ్‌తో అధికారికంగా ప్రమోషన్ పోస్టర్‌ పంచుకున్నారు.


Also read: రిజర్వేషన్ల వివాదంపై శిల్పాశెట్టి మాటలు వైరల్.. ఆ  పోస్ట్ వెనుక అసలు నిజమేంటి?


 ఈ నెల 31 న విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ మేకర్స్ మొదట నిర్ణయించారు.  కానీ, మేకర్స్ ఊహించని నిర్ణయంతో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. మూడు రోజుల క్రితమే అంటే 25 న ట్రైలర్ రిలీజ్ కావాల్సింది. కానీ ట్రైలర్ ని కూడా వాయిదా వేశారు. ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా ఉన్నాడు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ డ్రాగన్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Ntr, Prashanth Neel, Mythri Movie Makers, 418 The Film

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.