![]() |
![]() |

సీతారామం తో తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమాన కథానాయికగా మారిన నటి మృణాల్ ఠాకూర్. ఆమె కోసమే సీతారామం ని రెండు మూడు సార్లు చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత నాని తో హాయ్ నాన్న చేసి ఆ చిత్ర విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా తెలుగు సినిమాకి కాబోయే నెంబర్ వన్ హీరోయిన్ అనే కితాబుని కూడా దక్కించుకుంది. తాజాగా ఆమెకి సంబంధించిన నయా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అంథేరీ ఏరియా ముంబై లోనే ఒక ఖరీదయిన ప్రాంతం. ఇక్కడ సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగానికి చెందిన ఎంతో మంది సెలబ్రిటీస్ నివాసం ఉంటారు. తాజాగా మృణాల్ ఈ ఏరియాలోనే ఒక ఇంటిని కొన్నట్టుగా తెలుస్తుంది. ఇంటి ఖరీదు 5 కోట్లు దాకా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ బాబాయి కి చెందిన ఇంటినే మృణాల్ కొనుగోలు చేసిందని అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో కూడా ఆమె ఇల్లు కొనబోతుందని తెలుస్తుంది.
మృణాల్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా తన హవాని చాటబోతుంది. అజిత్ లాంటి అగ్ర హీరో సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. అలాగే క్రేజీ హీరోలు అయినా శింబు,శివ కార్తికేయన్ లతో కూడా ఆమె జతకట్టనుంది. రాబోయే రోజుల్లో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో మృణాల్ టాప్ పొజిషన్ కి చేరుకోవడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు.
![]() |
![]() |