Home  »  News  »  Mohan babu: జయప్రదపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు 

Updated : May 5, 2026

 

 

తెలుగు సినిమా కీర్తిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నట ప్రపూర్ణ మోహన్ బాబు(Mohan Babu)పేరు గుర్తు చేసుకోవడం సినీ దర్మం. సినీ కళామతల్లికి ఇచ్చే గౌరవం కూడా. రీసెంట్ గా నిన్న మోహన్ బాబు తన గురువు, దైవ సమానులైన దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayanarao)జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది జరిగే 'డైరెక్టర్స్ డే' వేడుకల్లో పాల్గొన్నారు. అదే వేడుకల్లో ఒకప్పటి అందాల తారలు మోహన్ బాబు సమకాలీకులైన జయప్రద(Jayaprada),జయసుధ(Jayasudha)కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి గురించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో చూద్దాం

మోహన్ బాబు మాట్లాడుతు జయసుధ నాకు సోదరి వంటిది. కానీ జయప్రద మాత్రం కాదు అని మోహన్ బాబు అన్నాడు. జయప్రద వెంటనే "ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్" అంటూ సరదాగా రియాక్ట్ అయ్యారు. మోహన్ బాబు మాత్రం తన స్పీచ్ ని కంటిన్యూ చేస్తు గతంలో చెన్నైలోని  ఏవీఎం స్టూడియోలో జరిగిన సంఘటన గురించి చెప్తు 'దాసరి గారి దర్శకత్వంలో కృష్ణంరాజు, జయప్రద హీరో హీరోయిన్లుగా షూటింగ్ జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకి  మొదలై మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు సాగింది. ఆ మూవీలో నేను కూడా ఉన్నాను. క్యారక్టర్ ప్రకారం నేను జయప్రదని లాక్కెళ్లిపోవాలి. అప్పుడు అల్లు రామలింగయ్య గారు వచ్చి అయ్యా ఇలాంటి అమ్మాయిని అలా ఎలా లాక్కెళ్తారు. ప్రాబ్లమ్ అవుతుంది కదా అని అడిగారు’ అని చెప్పారు. దీంతో జయప్రదతో సహా అక్కడున్న వాళ్లంతా నవ్వారు.


Also read: Ram charan: ఆ హీరో గెలుపు ఖాయమైన నేపథ్యంలో రామ్ చరణ్ కీలక నిర్ణయం!.. ఫ్యాన్స్ కి పూనకాలే 

జయప్రద, మోహన్ బాబు హీరో హీరోయిన్లుగా ఎన్నో చిత్రాల్లో చేసారు. ముఖ్యంగా దాసరి దర్శకత్వంలోనే వచ్చిన పాలు-నీళ్లు అయితే ఆ ఇద్దరి ఫెయిర్ కి ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక డైరెకర్స్ డే సభలో దర్శకుల సంఘానికి తన వంతుగా 15 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.