![]() |
![]() |

తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(MOhan Babu)కి ఉన్న చరిష్మా చాలా ప్రత్యేకమైనది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా,హీరోగా కొనసాగిన ఆయనప్రయాణంలో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి.అవన్నీ కూడా నేటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(Ntr)తర్వాత ఆ స్థాయిలో డైలాగ్ చెప్పగల నటుడని దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayanarao)గారే స్వయంగా చెప్పారంటే మోహన్ బాబు రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు కుటుంబంలో జరిగిన వివాదం ఆయన అభిమానులని ఎంతగానో షాక్ కి గురి చేసింది.ఆ గొడవల్లో మోహన్ బాబు అనుకోకుండా ఒక జర్నలిస్టుపై దాడి చేసి గాయపరచగా, పోలీసు కేసు నమోదయ్యింది.దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్ ని ఆశ్రయించాడు.కానీ కోర్టు తిరస్కరించింది.దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తు పిటిషన్ వేసాడు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై మోహన్ బాబు అభిమానుల్లోనే కాకుండా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
ఇక గాయపడిన జర్నలిస్ట్ ని మోహన్ బాబు పరామర్శించి దాడి విషయంలో క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు సినీ కెరీర్ విషయానికి వస్తే తన తనయుడు విష్ణు(Vishnu)హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'(Kannappa)ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండటంతో పాటు అందులో ఒక కీలక పాత్రని కూడా పోషిస్తున్నాడు.
![]() |
![]() |