![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి జ్యోతి కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మెహర్ రమేష్.
"నా ప్రియమైన చిన్నక్క 'మెహెర్ జ్యోతి సుంకర' విజయవాడ లో స్వర్గస్తులైనారు." అంటూ మెహర్ రమేష్ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది.
వైరల్ న్యూమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతున్న జ్యోతి.. మంగళవారం రాత్రి అనంత లోకాలకి వెళ్లి పోయారు.
మెహర్ రమేష్ కి చిన్నప్పటి నుంచి అండగా నిలిచిన జ్యోతి.. రీసెంట్ గా ఆయన కూతురి పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించారు.
"ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడిన మా అక్క.. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు." అంటూ మెహర్ రమేష్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.
https://x.com/MeherRamesh/status/2079632473466802450
Meher Ramesh, Sister, Meher Jyothi Sunkara, Tollywood
![]() |
![]() |