Home

»

Latest News

సాయిపల్లవికి షాక్ ఇచ్చిన మణిరత్నం..ఈ సారి తప్పదు చిట్టి తల్లి 

Oct 19, 2024 5:44PM

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం(mani ratnam)కూడా ఒకరు.ఆయన ప్రతి సినిమా టేకింగ్ పరంగా,టెక్నీకల్ పరంగా రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉండి,ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.ఇందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ.ప్రతి ఒక్క నటుడు,నటీమణి ఆయన సినిమాలో నటించాలని కోరుకుంటారు.

రీసెంట్ గా శివ కార్తికేయన్(sivakarthikeyan)సాయి పల్లవి(sai pallavi)కాంబోలో తెరకెక్కిన అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది.ఈ కార్యక్రమానికి మణిరత్నం ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి మాట్లాడుతూ సాయి పల్లవి నటన అంటే నాకు చాలా ఇష్టం.ఆమెతో కలిసి పని చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది.ఆ రోజు కోసమే ఆలోచిస్తున్నాను  త్వరలోనే ఆ  అవకాశం రావాలని చెప్పుకొచ్చాడు.దీంతో సాయి పల్లవి ఆనందంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది.నిజానికి  సాయి పల్లవికి తన కెరీర్ ప్రారంభంలోనే మణిరత్నం డైరెక్షన్ లో  అవకాశం వచ్చిందని,కానీ  సాయి పల్లవే రిజెక్ట్ చేసిందనే వార్తలు గతంలో వినిపించాయి.ఈ క్రమంలో సాయి పల్లవి గురించి  మణిరత్నం బహిరంగంగా  మాట్లాడటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య(naga chaitanya)తో తండేల్ తో పాటు రణబీర్ కపూర్(ranbirkapoor)తో కలిసి రామాయణ లో సీతగా చేస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత అయిన మణిరత్నం కాంబోలో సాయి పల్లవి సినిమా చెయ్యాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.అమరన్ ఈ నెల 31 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుండగా కమల్ హాసన్(kamal haasan)నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న  అమరన్‌ లో ఆయన భార్య  ఇందు రెబెకా పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. ఆ పాత్ర కోసం ఇందు ని కలిసి సాయి పల్లవి పలు సూచనలు కూడా తీసుకుంది.

 

  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com