![]() |
![]() |

మలయాళ చిత్ర సీమలో మెగాస్టార్ గా గుర్తింపు పొందారు మమ్ముట్టి. ఇక తన వారసుడిగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్ కూడా అనతికాలంలోనే మాలీవుడ్ లో స్టార్ డమ్ చూశారు. ఈ ఇద్దరు కూడా మాతృభాషకే పరిమితం కాకుండా అన్యభాషల్లోనూ సందడి చేశారు. మరీముఖ్యంగా.. తెలుగులో అటు మమ్ముట్టి, ఇటు దుల్కర్ సల్మాన్ - ఇద్దరు కూడా స్ట్రయిట్ పిక్చర్స్ తో మెస్మరైజ్ చేయడమే కాకుండా మెమరబుల్ హిట్స్ ని క్రెడిట్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. జస్ట్ వారం గ్యాప్ లో ఈ చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా `సీతా రామం`. `యుద్ధం`తో రాసిన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ పిరియడ్ డ్రామాలో మృణాళ్ ఠాకూర్ నాయికగా నటిస్తుండగా.. రష్మికా మందన్న స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనుంది. ఆగస్టు 5న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ఇక `సీతా రామం` విడుదలైన వారం తరువాత అంటే ఆగస్టు 12న మమ్ముట్టి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న `ఏజెంట్` తెరపైకి వస్తోంది. అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. మరి.. ఫస్ట్ దుల్కర్, నెక్స్ట్ మమ్ముట్టి అన్నట్లుగా ఈ ఆగస్టులో కేవలం వారం వ్యవధిలో రాబోతున్న ఈ తండ్రీకొడుకులు.. సదరు స్ట్రయిట్ తెలుగు పిక్చర్స్ తో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |