![]() |
![]() |

మూడు వారాల్లో రాజా సాబ్ రాక
కనిపించని ప్రభాస్ రేంజ్ హైప్!
ఓవర్సీస్ బుకింగ్స్ కి షాకింగ్ రెస్పాన్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి?
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఆయన సినిమా వస్తుందంటే ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్ 'ది రాజా సాబ్' విషయంలో ఆ రేంజ్ హైప్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (The Raja Saab)
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూవీ 'ది రాజా సాబ్'. ఈ హారర్ కామెడీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. రెండు సాంగ్స్ కూడా విడుదల కాగా.. సెకండ్ సింగిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారంటూ మూవీ టీమ్ మొదటి నుంచి ప్రచారం చేసింది. విడుదలకు ఇంకా మూడు వారాలే సమయముంది. అయినప్పటికీ ఎందుకనో రాజా సాబ్ పై రావాల్సిన హైప్ రాలేదు.
మామూలుగా ప్రభాస్ సినిమా బుకింగ్స్ ఓపెనింగ్స్ అయితే.. సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అలాంటిది 'రాజా సాబ్' ఓవర్సీస్ బుకింగ్స్ కి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. తెలుగునాట కూడా రెగ్యులర్ ప్రభాస్ సినిమాల స్థాయిలో దీని గురించి చర్చ జరగట్లేదు.
Also Read: హాట్ టాపిక్ గా ఛాంపియన్ ట్రైలర్.. బైరాన్పల్లి రక్త చరిత్ర!
రాజా సాబ్ నుంచి ఇంకా కొన్ని సాంగ్స్, రిలీజ్ ట్రైలర్ రావాల్సి ఉంది. ఆ అప్ కమింగ్ కంటెంట్ తో మెస్మరైజ్ చేసి, అందరి దృష్టిని తమ వైపు తిప్పుకునేలా మూవీ టీమ్ చేయాల్సి ఉంది. మరి అలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ రాజా సాబ్ నుంచి వస్తుందేమో చూడాలి.
అయితే 'రాజా సాబ్'పై భారీ హైప్ లేదనే చర్చల నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ వేరేలా ఉంది. ప్రభాస్ గత చిత్రం 'కల్కి 2898AD' విషయంలోనూ ఇలాగే అంతగా బజ్ లేదన్నారు. కట్ చేస్తే ఆ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు 'రాజా సాబ్' కూడా అలాంటి సర్ ప్రైజ్ ఇవ్వడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
![]() |
![]() |