
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించి, బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించిన 'DC' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా సెప్టెంబర్ 4 నుండి 'సన్ నెక్ట్స్'లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మామూలుగా లోకేశ్ కనగరాజ్ అంటేనే స్క్రీన్ మీద పవర్‌ఫుల్ హీరోలు, ఎలివేషన్లు, గూస్‌బంప్స్ యాక్షన్ సీన్లు గుర్తుకొస్తాయి. కానీ ఈసారి ఆయన కెమెరా వెనుక కాదు.. కెమెరా ముందు నిలబడి, ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఆయనకు జోడీగా వామికా గబ్బి పర్‌ఫార్మెన్స్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్, అన్నిటికీ మించి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. అందుకే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిసింది.
[DC Movie, OTT Release, Lokesh Kanagaraj, Arun Matheswaran, Wamiqa Gabbi, Anirudh Ravichander, Telugu Cinema, Telugu News, Tollywood]





