Home  »  News  »  కొత్త మలుపు తీసుకున్న నరేష్ పవిత్ర లోకేష్ వివాహం....!

Updated : Jan 9, 2023

మొత్తానికి బ‌తికున్నంత కాలం డేరింగ్ అండ్ డాషింగ్గా బ‌తికానన్న గ‌ట్స్ ఉన్న హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ‌. ఆయ‌న త‌న కుటుంబాన్ని ఒప్పించి ఆనాడు ఎవ్వ‌రు చేసుకోని విధంగా బ‌హిరంగంగానే విజ‌య‌నిర్మ‌ల‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఆయ‌న ఏమి చేసిన బాహాటంగానే చేసేవారు. మొహ‌మాటం లేకుండా అంద‌రికీ తెలిసే విధంగానే ఆయ‌న నాడు ఎన్టీఆర్‌తో విభేదించారు. ఒకానొక స‌మ‌యంలో కాంగ్రెస్‌ను కూడా వ్య‌తిరేకిస్తూ ఈనాడు అనే సంచ‌ల‌నాత్మ‌క చిత్రాన్ని చేశారు. అది నాడు తెలుగుదేశానికి, ఎన్టీఆర్ కి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఆపై టిడిపిని ఎన్టీఆర్ ని విభేదిస్తూ సెటైరిక‌ల్గా ప‌లుచిత్రాలు తీశారు. అధికారంలో ఉన్నప్ప‌టికీ ఎన్టీఆర్ కి ఆయ‌న భ‌య‌ప‌డ‌లేదు. దాన వీర శూర క‌ర్ణ‌కి పోటీగా కురుక్షేత్రం తీశారు. ఈ చిత్రం విజయం సాధించ‌క‌పోయినా ఆనాడే ఆయ‌న ఎంతో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లూరి సీతారామ‌రాజు, దేవ‌దాసు వంటి చిత్రాల‌కు ఎదురు దెబ్బ‌లు, అవ‌మానాలు, వ్య‌తిరేక‌త‌లు ఎదురైనా వాటిని ఆయన డోంట్ కేర్ అంటూ సాహ‌స‌మే నా ఊపిరి అన్న‌ట్లుగా జీవించారు. నిజానికి నాడు రాజీవ్‌గాంధీ బ‌తికి ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ విజ‌యం సాధించి ఉంటే రాజీవ్ ఖ‌చ్చితంగా కృష్ణ‌కే ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు అప్ప‌గించి ఉండేవారు. 

ఇక ఆయ‌న కుమారులైన ర‌మేష్‌బాబు, మ‌హేష్‌బాబులు కూడా త‌మ కెరీర్‌, సంసారం, సామాజిక సేవా కార్య‌క్రమాలు త‌ప్పించి ప్ర‌జ‌ల్లో ఎప్పుడు చుల‌క‌న కాలేదు. ప‌రిశ్ర‌మ‌లోని వారు వారిని విమ‌ర్శించ‌వ‌చ్చు గానీ ఇండ‌స్ట్రీ బ‌య‌ట మాత్రం వారు ఎంతో హుందాగా ప్ర‌వ‌ర్తిస్తూ ఉండేవారు. అంత గొప్ప‌గా బ‌తికిన కృష్ణ ఫ్యామిలీ ఇప్పుడు న‌రేష్ కార‌ణంగా వార్త‌ల్లోకి ఎక్కింది. ప్రతి విషయానికీ రెండు కోణాలుంటాయి... అవి  విభిన్నంగా ఉంటాయి. నాణానికి బొమ్మా బొరుసు ఉన్నట్టే ప్రతి విషయంలోనూ రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయి. ఆ రెండు కోణాలూ తెలిసిన వారు మాత్రమే ఏది నిజం ఏది అబద్దం అనేది తేల్చ గలరు. ఒక వ్యక్తి వాదనలు విని ఏ విషయాన్నిజ‌డ్జ్ చేయ‌లేం.  ఎదుటివారి వాదన కూడా వినాల్సి ఉంటుంది. ఇక ఇటీవల నటి కరాటే కళ్యాణి ఎంత దారుణంగా తనను తన భర్త హింసించేవాడు చెప్పుకొచ్చింది. మరో వివాహం చేసుకోవాలని ఉందని ప్రకటించింది. ఇప్పుడు సీనియర్ నరేష్ పై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేసింది. తనను వదిలించుకోవడానికి నరేష్ ఎన్నో దారుణాలు చేశాడని తెలిపింది. చివరకు దేవుడులాంటి కృష్ణా కు తనకు అక్రమ సంబంధం అంటగట్టాడ‌ని  అని వాపోయింది. తండ్రి లాంటి కృష్ణ‌కు  నాతో అక్రమసంబంధం అనేది భరించలేకపోయాను... కానీ కృష్ణ గారి ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడడం కోసం తాను మౌనంగా ఉన్నానని చెప్పింది. కృష్ణ తన వలన ప్రాణహాని ఉందని ఒక ఫేక్ లెటర్ సృష్టించి దానిమీద కృష్ణ కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించింది. ఇది మామూలు ఆరోపణ కాదు.ఇండస్ట్రీలో ఎంతో పేరున్న సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి సంబంధించిన విషయం. ఈ విషయాలను ఆమె విజయనిర్మల, కృష్ణ‌లు బ‌తికుండ‌గా చెప్పకుండా ఇప్పుడు వాటిని బయటకు తీయడం విచిత్రం ఇక్కడ ఒక  విషయం అర్ధ‌మ‌వుతోంది. నరేష్ తాను పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నట్లు  విజయనిర్మల, కృష్ణ బతికున్నంత వరకు చెప్పలేదు. నాకు వివాహం మీద న‌మ్మ‌కం  లేదు. మేము సహజీవనం చేస్తున్నాము. పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు. కానీ వారు చనిపోయిన వెంటనే ఆయ‌న  నాలుగో వివాహాన్ని ప్రకటించాడు.ఇందులో ఏదో మతలబు ఉన్నట్లుగా  అందరికీ అనిపిస్తోంది. నరేష్ తన కుమారుడి ముందే పోర్న్ వీడియోలు తెలిపింది. ర‌మ్య కుటుంబం కూడా చిన్నదేమీ కాదు. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె ఆమె. సీనియర్ నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగో వివాహానికి సిద్ధమయ్యాడు. పవిత్ర లోకేష్ ను  వివాహం చేసుకుంటాను అంటున్నాడు. ఒకరితో విభేదాలు అంటే సరే ఏకంగా ముగ్గురితో వివాహ బంధాలు విబేధాల వ‌ల్ల ఎలా నాశ‌నం అవుతాయి? నరేష్ ప్రవర్తనపై అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజిత నరేష్ చాలా మంచివాడని కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది ఒకసారి నరేష్ త‌న‌ ను ఆదుకున్నాడు అని ఆమె తెలిపింది. అందులో మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేష్ ఎందరికో సాయం చేశాడని ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని పేర్కొంది. 

ఇక తాను సాయం అడిగిన స‌మ‌యంలో   మా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ తనకు సాయం చేయలేదని ఆరోపించింది. రాజేంద్ర ప్రసాద్ నేను ఒకేసారి  ఈసీ మెంబర్స్ గా ఉన్నామని తనతో ఎన్నో చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ త‌ను ఎవరో తెలియనట్లు ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పుకొచ్చింది.  నరేష్ చాలా మంచివాడని కానీ అతడు ఒక నెత్తిమీద శ‌ని పెట్టుకున్నాడ‌ని తెలిపింది.  ఇంతకీ ఆ శ‌ని ఎవరు అంటే సమాధానం లేదు. బహుశా అది నరేష్ పై ఆరోపణలు చేసిన ర‌మ్య అయి ఉండవచ్చు.  అయినా తనకు సాయం చేసినంత మాత్రాన సీనియర్ నరేష్ మంచివాడై పోతాడా అనేది అసలు ప్రశ్న. కొంద‌రు ఆడవారికి సహాయం చేస్తూ ఉంటారు. కానీ మగవారు అడిగితే మాత్రం సాయం చేయరు. ఆప‌ద‌లో ఉన్నార‌ని తెలిసినా ఆదుకోరు. ఆడ‌వాళ్లయితే మాత్రం పాపం ఆడ‌వారు అంటూ సాయం చేస్తారు.  అంటే వారు సాయం చేసే విధానంలో ఎక్కడో చెడు అభిప్రాయం ఉంటుంది.   కేవలం పూజితకు సాయం చేసిన తర్వాత  నరేష్ గొప్పవాడు కాలేడు. ఎందుకంటే మా ఎలక్షన్లలో అతను ఏ రేంజ్ లో తన ప్రావీణ్యం చూపించాడో  అందరికీ తెలుసు.  మొత్తానికి ఇది కృష్ణ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ఉంది. కృష్ణ‌ని అందునా మ‌ర‌ణించిన త‌ర్వాత ఇలా వివాదాల‌లోకి లాగ‌డం చాలా బాధాక‌రం.   దీనికి సరైన సమాధానం చెప్పగలిగే వారు రావాలి. ఈ విషయంలో నరేష్ గురించి రమ్య గురించి పూర్తిగా తెలిసిన వారు వచ్చి తప్పు ఒప్పులను బయటకు చెబితే గాని అసలు విషయం బయటకు రాదు. లేదా ఈ వివాదాన్ని మరింత పెద్దది కాకుండా చేయాలి. కానీ రమ్య మాత్రం నరేష్ కు విడాకులు ఇవ్వను అంటుంది. తన కుమారుడు తన తండ్రి కావాలని కోరుతున్నాడు అని చెబుతోంది. మొత్తానికి ఈ వ్య‌వహారం చినికి చినికి గాలివాన‌లా మారుతోంది. మ‌రి దీనికి ఎంత తొంద‌ర‌గా ఫుల్ స్టాప్ పెడితే అంత మంచిది....!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.