![]() |
![]() |

సోమవారం(జూలై 5) నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 22వ సినిమాను ప్రకటించారు. 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' అనే మూవీని చేయబోతున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించనున్నారు.
కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా 'డెవిల్' మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగుంది. 1945లో సాగే ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ కథతో ఈ సినిమా ఉండబోతోందని టీజర్ లో పేర్కొన్నారు. అలాగే ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. కళ్యాణ్ రామ్ గెటప్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. పంచెకట్టు, మెలితిప్పిన మీసాలు, గుబురు గడ్డం, నల్లటి కోటు, చేతిలో రివాల్వర్ తో ఆకట్టుకుంటున్నాడు.
పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న 'డెవిల్' తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
![]() |
![]() |