Home  »  News  »  దళపతి విజయ్ 'జన నాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్.!

Updated : Jul 15, 2026

కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం 'జన నాయగన్' ( తెలుగులో 'జన నాయకుడు'). హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా వచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేస్తూ, ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

"నిప్పుతో పరీక్షించబడింది, కాలంతో మలచబడింది, చరిత్ర కోసం నిర్మించబడింది. పోరాటం ఎంత కఠినంగా ఉంటే, విజయం అంత ఘనంగా ఉంటుంది." అంటూ ఈ సినిమాపై అంచనాలను పెంచే విధంగా వారు ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతోంది. దళపతి విజయ్ చేతిలో కత్తి పట్టుకొని, పోలీస్ గెటప్ లో ఉన్న లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. జూలై 23న ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది. 

ఈ 'జననాయకుడు' ప్రాజెక్టును కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

విజయ్ ఆఖరి చిత్రం కావడంతో, సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కావడంతో 'జననాయకుడు' కోసం కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూలై 23న విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. 

https://x.com/KvnProductions/status/2077324861123555408

 

Thalapathy Vijay, Jana Nayagan, H Vinoth, Anirudh Ravichander, KVN Productions

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.