![]() |
![]() |

-వార్నింగ్ ఇస్తున్న దర్శకుడు ఎవరు
-ఈ నెల 19 న ఏం జరగబోతుంది
-లెటర్ లో ఏముంది
-జేమ్స్ కామెరూన్ ఏమంటున్నాడు!
వరల్డ్ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ సినీ పితామహుడు జేమ్స్ కామెరూన్(James Cameron)మరో అద్భుత సృష్టి 'అవతార్ 3 ఫైర్ అండ్ యాష్'(Avatar 3: Fire and ash)ఈ సారి పాండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ ని కామెరూన్ పరిచయం చేయబోతున్నాడు. దీంతో ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా మొదటి రెండు పార్టులకి మించి సెల్యులాయిడ్ పై సరికొత్త వండర్ ప్రత్యక్షం కాబోతుంది. ఈ నేపధ్యంలో పార్ట్ 3 ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడాలనుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతు ఉంది. ఇప్పుడు వాళ్ల తొందరని జేమ్స్ కామెరూన్ రాసిన ఒక లేఖ రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రీసెంట్ గా కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేకమైన లేఖ రాసారు. సదరు లేఖలో ఈ సినిమాతో పాటు పంపిన డీసీపీ లో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్ ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి. లైట్ లెవల్స్, ఆడియో కాన్ఫిగరేషన్ కూడా ముఖ్యం.సౌండ్ సిస్టమ్ ని నేనే వ్యక్తిగతంగా మిక్స్ చేశాను. పూర్తి అనుభూతి కోసం 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ని తగ్గించవద్దు. థియేటర్ల నిర్వహణ ప్రేక్షకుల అనుభూతిలో కీలకం.ఆ విషయంలో ఎలాంటి రాజీపడవద్దు. ఒక రకంగా హెచ్చరిక లాంటిదని తన లెటర్ లో కామెరూన్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
also read: తిండి, నిద్ర మానేసి రాత్రంత అదే పని.. దాంతో ఆరోగ్యం నాశనం
దీంతో కామెరూన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ప్రపంచ సినీ ప్రేక్షకులకి అత్యుత్తమ క్వాలిటీ తో సినిమాని అందించాలనే నిబద్దత కామెరూన్ కి ఎంతలా ఉంటుందో అనడానికి ఇదొక నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అవతార్ 3 సుమారు 400 మిలియన్ల డాలర్స్ తో తెరకెక్కింది.
![]()
![]() |
![]() |