![]() |
![]() |

కొంతకాలంగా రెండు భాగాల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ప్రభాస్ (prabhas) హీరోగా నటించిన 'బాహుబలి'తోనే ఈ ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు భాగాల సినిమాల విషయంలో ప్రభాస్ తప్పటడుగులు వేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తన గత రెండు చిత్రాలు 'సలార్' (Salaar), 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) లతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు ప్రభాస్. సలార్ రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టగా, కల్కి రూ.1100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రెండు సినిమాలు కూడా రెండు భాగాలుగా రానున్నట్లు విడుదలకు ముందే ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఈ సినిమాల సెకండ్ పార్ట్ లు వచ్చే అవకాశం కనిపించడంలేదు.
మొదటి భాగం మంచి విజయం సాధించినప్పుడు.. హీరో, డైరెక్టర్ ఇతర సినిమాల జోలికి పోకుండా.. తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా పార్ట్-2 ని విడుదల చేస్తే ఆడియన్స్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. 'బాహుబలి', 'కేజీఎఫ్', 'పుష్ప' వంటి సినిమాలను దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ 'సలార్', 'కల్కి' విషయంలో అలా జరగడంలేదు. 'సలార్' తర్వాత 'కల్కి' వచ్చింది. 'కల్కి' తర్వాత 'రాజా సాబ్' రానుంది. ఆ తర్వాత కూడా 'సలార్ 2', 'కల్కి 2' వచ్చే అవకాశాలు కనిపించడంలేదు.
'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఆగష్టు 9న ఈ మూవీ లాంచ్ కానుంది. ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని అంటున్నారు. అదే జరిగితే ఇప్పట్లో 'సలార్ 2' పట్టాలెక్కే అవకాశంలేదు. ఇక 'కల్కి' విషయానికొస్తే.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫోకస్ 'కల్కి 2' పైనే ఉన్నప్పటికీ.. ప్రభాస్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానం. ఎందుకంటే ప్రస్తుతం 'రాజా సాబ్'తో బిజీగా ఉన్న ప్రభాస్.. హను రాఘవపూడి ప్రాజెక్ట్ 'ఫౌజీ'ని కూడా పారలల్ గా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత 'స్పిరిట్' లైన్ లో ఉంది. వీటి నడుమ 'కల్కి 2' కి ప్రభాస్ ఎప్పుడు సమయం కేటాయిస్తాడనేది బిగ్ క్వశ్చన్.
పార్ట్ 2 పై మంచి మంచి హైప్ ఉన్న సమయంలో దానిని త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలి. అలా కాకుండా.. ఇతర ప్రాజెక్ట్ లు చేసి, ఎప్పటికో పార్ట్ 2 ని విడుదల చేస్తే.. ఆడియన్స్ లో మునుపటి క్రేజ్ ఉండకపోవచ్చు. అందుకే ఈ విషయంలో ప్రభాస్ తెలిసో తెలియకో తప్పు చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
![]() |
![]() |