Home  »  News  »  Irugapatru Movie Review: ‘ఇరుగపాట్రు’ మూవీ రివ్యూ

Updated : Nov 7, 2023



మూవీ : ఇరుగపాట్రు
నటీనటులు: శ్రద్ధ శ్రీనాథ్, విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రీ, అబర్నథి, సానియా అయ్యప్పన్
రచన: మహారాజ్ దయాలన్
ఎడిటింగ్: జె. వి మణికందన్ బాలాజీ
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: గోకుల్ బినోయ్
నిర్మాతలు: ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్. ఆర్ ప్రభు, పి. గోపీనాథ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యువరాజ్ దయాలన్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్

కొన్ని సినిమాలు ఇతర భాషలలో విడుదలై తెలుగులోకి అనువదించాక హిట్ అవుతున్నాయి. అలాంటివాటికి ఓటీటీల్లో క్రేజ్ ఉంది. అలాంటిదే 6 అక్టోబర్ 2023 లో తమిళ్ లో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న  'ఇరుగపాట్రు' మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఇతర భాషలలో విడుదలైంది. మరి ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం...


కథ:

మిత్ర అనే ఒక ఆవిడ సైకాలిజిస్ట్ గా చేస్తూ తన భర్త మనోహర్ తో హ్యాపీ లైఫ్ ని కొనసాగిస్తుంటుంది‌. మొదటగా  తను ఒక సెమినార్ ని కండక్ట్ చేస్తుంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలతో మిత్ర దగ్గరికి వస్తుంటే, వారికి సరైన అవగాహన కల్పించి పంపిస్తుంది. అయితే అర్జున్ మొదటగా తన భార్య అసలు మాట్లడట్లేదని, దగ్గరికి వెళ్తే దూరం వెళ్తందని వాదనతో మిత్ర దగ్గరికి వస్తాడు. మిత్ర అంతా విని తన భార్యని రమ్మని చెప్తుంది. ఆమెతో మాట్లాడాక అసలు విషయం మిత్రకి అర్థమవుతుంది. ఆ తర్వాత అదే తరహాలో పవిత్ర వచ్చి తన భర్త విడాకులు కావలన్నాడని చెప్తుంది. ఆమె భర్తని రమ్మని చెప్పి సమస్యని తెలుసుకుంటుంది మిత్ర. అయితే ఇలా తన దగ్గరికి విభిన్న సమస్యలతో వచ్చినవాళ్ళకి సరైన అవగాహన కల్పించే క్రమంలో తనకి కూడా ఇలాంటి సమస్య ఒకటి వస్తుంది. మరి ఆ సమస్యని మిత్ర పరిష్కారించుకోగలిగిందా? భార్యాభర్తలని కలిపిందా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితాలలో భార్యభర్తలు ఒక గంట కూడా మనసు విప్పి మాట్లాడుకోవట్లేదని సెమినార్ లో చెప్తుంటుంది మిత్ర. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే విడాకుల దాకా వస్తాయంటు మిత్ర జాగ్రత్తపడుతుంది. అయితే అర్జున్ అనే ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి వారి భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్య, రంగేశ్ అనే వ్యక్తి చెప్పిన ‌సమస్య, ఇలా ఒక్కొక్కరు మిత్ర దగ్గరికి వచ్చి చెప్పే సమస్యలు ఎక్కడ తన లైఫ్ లోకి వస్తాయోనని భావిస్తుంది.  అలాగే మిత్ర, మనోహర్ ఇద్దరి మధ్య అసలు ఒక్కటంటే ఒక్క గొడవ కూడా రాకపోవడంతో అందరు ఆశ్చర్యపోతారు. 

సినిమా ప్రథమార్ధం వరకు ఇతరుల మధ్య వచ్చే సమస్యలని పరిష్కరించే మిత్రకి తన భర్తకి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది.  ఏ గొడవ పడకుండా ఉండటం కూడా సమస్యే అనే విషయం మిత్రకి తర్వాత అర్థమవుతుంది. పేపర్ లో వచ్చిన ఒక న్యూస్ తన జీవితాన్ని ఇలా ఇంపాక్ట్ చేస్తుందా అని మిత్ర భావిస్తుండగా, తన భర్త మనోహర్ కి ఒక నిజం తెలుస్తుంది.  అ నిజమేంటనేది, దాన్ని వాళ్ళిద్దరు ఎలా పరిష్కారించుకున్నారనే ఉత్కంఠతో కథ పూర్తిగా ఒక ఇంటెన్స్ తో సాగుతుంది. అయితే కథలో అర్జున్ , రంగేశ్ అనే ఇద్దరు జీవితాల మధ్య సమస్యలు సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.

అయితే ప్రథమార్ధంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ద్వితీయార్థంలో కూడా అలానే ఉండటంతో ప్రేక్షకులకి కాస్త నిరాశ కల్గించిన పెళ్ళైన వారికి ఇవన్నీ ఒక మంచి సందేశాన్ని ఇస్తాయనే చెప్పాలి. ఏ సమస్యకైన పరిష్కారం ఉంటుంది. చిన్న చిన్న గొడవలకి విడిపోకూడదంటూ యువరాజ్ దయాలన్ చూపించే ప్రతీ సీన్ ఆకట్టుకుంది. కథలో కొత్తదనం, మాటలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఒకానొక దశలో పెళ్ళికి ముందు ఉన్న మనుషులు పెళ్ళి తర్వాత ఉండలేరంటూ చెప్తూనే వారి లైఫ్ లో గడిపిన చిన్న చిన్న సంతోషాలని వెతికి పట్టుకుని సాగిపోవాలంటూ చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ యువరాజ్ దయాలన్. అయితే ఇది కామన్ ఆడియన్స్ కి వన్ టైమ్ చూడొచ్చు ఎందుకంటే పెళ్ళి తర్వాత సమస్యలు ఉంటాయని చెప్పడం, వాటిని ఎలా పరిష్కారించుకోవాలో చూపించాడు. మెచురిటీ ఉన్న స్టోరీ, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మెచుర్డ్ సంభాషణలో కొన్ని పదాలు ఇబ్బంది పెడతాయి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కథనం నెమ్మదిగా సాగిన రిలేషన్ షిప్ లో బాగుండాలంటే ఒక మెచురిటీ ఉండాలంటూ కొనసాగుతుంది. ప్రతీ సీన్ లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తాయి.  మహారాజ్ దయాలన్ రాసుకున్న కథని యువరాజ్ దయాలన్ చక్కగా తీర్చిదిద్దాడు. జస్టిన్ ప్రభాకరన్ ‌అందించిన మ్యూజిక్ బాగుంది. గోకుల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. జె.వి మణికందన్ బాలాజీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సైకాలజిస్ట్ మిత్ర పాత్రలో శ్రధ్ధ శ్రీనాథ్ ఆకట్టుకుంది. మెచుర్డ్ గా థింకింగ్ చేసే మనోహర్ పాత్రలో విక్రమ్ ప్రభు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. రంగేశ్ గా విదార్థ్, అర్జున్ గా శ్రీ, పవిత్ర గా అబర్నథి, దివ్యగా సానియా అయ్యపన్ తమ తమ పాత్రాలకి న్యాయం చేశారు. 


తెలుగువన్ పర్ స్పెక్టివ్: 

పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకు పరిష్కారం చెప్తూ తీసిన ఈ సినిమాని కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. పెళ్ళైన వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

 రేటింగ్: 3 / 5 

✍🏻. దాసరి  మల్లేశ్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.