Home

»

Latest News

'బ్రో'లో ఐటమ్ సాంగ్.. పోటీపడుతున్న బ్యూటీస్!

May 23, 2023 6:08PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పవన్, సాయి తేజ్ ల ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

'బ్రో' సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ సాంగ్ ఉంటుందట. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయట. ఇందులో ఒకటి ఐటమ్ సాంగ్ అని తెలుస్తోంది. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్ లో ఐటమ్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తి చేస్తారని సమాచారం. ఈ సాంగ్ లో శృతి హాసన్ లేదా దిశా పటాని సందడి చేయనున్నారని వినికిడి. శృతి హాసన్ గతంలో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ లో పవన్ సరసన నటించింది. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మరి ఈ ఇద్దరి బ్యూటీలలో ఎవరి పేరు ఖరారు చేస్తారో చూడాలి. 

'బ్రో' చిత్రం 2023, జులై 28న విడుదల విడుదల కానుంది. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com