![]() |
![]() |

-హృతిక్ రోషన్ మాజీ ప్రియురాలు ఎవరు
-హాస్పిటల్ లో ఉండటానికి కారణం ఏంటి!
-అసలు ఆమెకొచ్చిన వ్యాధి తీవ్రత ఎంత
స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)ఒకప్పటి ప్రియురాలుగా ప్రముఖ నటి సబా ఆజాద్(Saba Azad)కి గుర్తింపు ఉంది. ఆ తర్వాతి కాలంలో మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. రీసెంట్ గా సబా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన వాళ్లంతా సబా ఆరోగ్య విషయంపై బాధపడుతున్నారు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
ఇనిస్టా వేదికగా బెడ్ పై పడుకొని ఉన్న తన పిక్ ని షేర్ చేస్తు నేను ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’అనే ప్రమాదకర పరాన్నజీవి వల్ల వచ్చిన 'సైక్లోస్పోరియాసిస్ అనే వ్యాధి బారిన పడ్డాను. గడిచిన 14 రోజులు నా లైఫ్ లోనే అత్యంత దారుణమైనవి. రోజుకి రెండు సార్లు జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేసే నేను, ఇప్పుడు కనీసం ఒక టూత్‌పిక్ ఎత్తేంత బలం కూడా లేని స్థితికి చేరుకున్నాను. కేవలం రెండు వారాల వ్యవధిలోనే నాలుగు కిలోల బరువు తగ్గిపోయాను. కనీసం నడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉన్నాను. అలాంటి ఈ కష్ట సమయంలో హృతిక్ రోషన్ తన పక్కనే ఉండి ధైర్యం చెబుతున్నాడు.
Also read: Rishab Shetty: స్టార్ హీరోయిన్ ని అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి.. అందులో ఆమె హ్యాండ్ కూడా ఉంది
ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనుక ఉన్న కారణం నన్ను షాక్ కి గురిచేసింది. ఎప్పుడూ ఇంటి భోజనమే తింటాను. బయటకు వెళ్లినా సొంత వాటర్ బాటిల్‌నే వెంట తీసుకెళ్తాను. ఇంతలా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినా సదరు పరాన్నజీవి శరీరంలోకి ఎలా చేరిందో అర్థం కావడం లేదని చెప్పింది. అంతే కాకుండా నెటిజన్లని హెచ్చరిస్తూ మనం తినే ఆకుకూరలు, సలాడ్స్,కూరగాయల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలని కేవలం నీటితో కడిగితే సరిపోదు. బేకింగ్ సోడా లేదా వెజీ వాష్ ఉపయోగించి శుభ్రం చేయాలి. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఢిల్లీకి చెందిన సబా పూర్తి పేరు సబా సింగ్ గ్రేవాల్. ఇప్పటకి వరకు సుమారు పది చిత్రాల వరకు చేసింది. గత ఏడాది బాబీ డియోల్ హీరోగా వచ్చిన బందర్ అనే మూవీలో ఖుషి గా బాబీ డియోల్ ప్రేమికురాలిగా కనిపించింది. సింగర్ గాను తన సత్తా చాటింది.

![]() |
![]() |