![]() |
![]() |
.webp)
ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రవితేజ ,రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోలు పక్క న హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకులని తన అందంతో నటనతో అలరించిన నటి హన్సిక. గత సంవత్సరం వివాహం చేసుకున్న హన్సిక ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
హన్సిక టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. స్కిన్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. బహుశా భారతీయ చిత్రసీమలో మొట్టమొదటి సారిగా స్కిన్ మాఫియా మీద తెరకెక్కుతున్న మూవీ మై నేమ్ ఈజ్ శృతి నే అని చెప్పవచ్చు. యాడ్ ఏజెన్సీ లో పని చేసే శృతికి ఒక భయంకరమైన సమస్య ఎదురవుతుంది. అప్పుడు ఆమె ఆ సమస్య నుంచి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కథ. నవంబర్ 17 న తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన సినిమా గురించి హన్సిక మీడియాతో మాట్లాడుతూ మా మై నేమ్ ఈజ్ శృతి సినిమా పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులు సినిమాని చూస్తున్నంత సేపు ఏం జరుగుతుందనే ఉత్కంఠతతో చూస్తారని చెప్పింది. అలాగే ఈ సినిమాలో మేము చూపిస్తున్నస్కిన్ మాఫి ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుందని కూడా హన్సిక చెప్పింది.
![]() |
![]() |