![]() |
![]() |

అడవి శేషు(Adavi Seshu)హీరోగా 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ గూఢచారి(goodhachari 2)యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్నిఅందుకోవడమే కాకుండా,కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని రాబట్టింది.అడవి శేషు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెట్ హిట్ గా కూడా నిలిచిందని చెప్పవచ్చు.ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా గూఢచారి 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory)ఏకే ఎంటర్ టైన్మెంట్స్(Ak entertainments),అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్(Abhishek Agarwal Arts)వంటి మూడు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ అందించారు.బాలీవుడ్ బ్యూటీ 'వామికా గబ్బి(Wamiqa Gabbi)తమ సినిమాలో భాగమయినట్టుగా,ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో వెల్లడి చెయ్యడం జరిగింది.వామికా రాకతో గూఢచారి 2 పై పాన్ ఇండియా లెవల్లో మరింత క్రేజ్ పెరగడం ఖాయమని చెప్పవచ్చు.ఎందుకంటే వామికా గబ్బి హిందీతో పాటు తమిళ,మలయాళ భాషలకి చెందిన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే పొందింది.'ఇరవకాలం', 'జెనీ' అనే రెండు తమిళ చిత్రాలు కూడా ప్రస్తుతం షూట్ దశలో ఉన్నాయి.లేటెస్ట్ గా బాలీవుడ్ లో రిలీజైన 'బేబీ జాన్' లో కూడా సూపర్ గా నటించింది.దీంతో ఆ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా 'వామికా' నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు.దీంతో గూఢచారి 2 కి 'వామికా' ఎంట్రీ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ఇక మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని జనవరి ఎండింగ్ లోనే ఇస్తున్నట్టుగా కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.అడవి శేషు,వామికా గబ్బి తో పాటు మధు శాలిని,ఇమ్రాన్ హష్మి,ప్రకాష్ రాజ్,జిష్ణు సేన్ గుప్తా,సుప్రియ యార్లగడ్డ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.సుమారు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి వినయ్ కుమార్ సిరిగినీడి(vinaykumar Sirigineedi) దర్శకుడు కాగా శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.
![]() |
![]() |