![]() |
![]() |

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఘాటి'. ఇద్దరికీ ఇది కమ్ బ్యాక్ ఫిల్మ్ లాంటిది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'ఘాటి'పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. (Ghaati Trailer)
డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో 'ఘాటి' తెరకెక్కిందని ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. డ్రగ్స్ మాఫియా కింద పని చేస్తూ.. ఆ మాఫియాకే ఎదురుతిరిగిన పవర్ ఫుల్ పాత్రలో అనుష్క కనిపిస్తోంది. లవ్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ అంశాలు ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో అనుష్క రుద్ర రూపం ఆకట్టుకుంది. "సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూద్దురు గాని" అనే ఒక్క డైలాగ్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు.
ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. అరుంధతి, భాగమతి వంటి సినిమాలు ఆమె కెరీర్ లో ఉన్నాయి. ఇప్పుడు 'ఘాటి' ట్రైలర్ లోనూ అనుష్క నట విశ్వరూపం కనిపిస్తోంది.
'ఘాటి' చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనుష్క మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, డైరెక్టర్ క్రిష్ కూడా సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
![]() |
![]() |