Home  »  News  »  మట్టి కుస్తీ 2 నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ నుండి సీక్వెల్ వరకు.. డైరెక్టర్ సంచలన నిజాలు

Updated : Jun 17, 2026

 

 

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా భర్త విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో వచ్చిన 'గట్ట కుస్తీ' (తెలుగులో 'మట్టి కుస్తీ') బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. భార్యాభర్తల మధ్య ఉండే ఈగోలు, కుస్తీ నేపథ్యంలో సాగిన ఈ మూవీ ప్రేక్షకులకి  విపరీతంగా నచ్చింది. 2022 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 2023 జనవరి 1 నుండి ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయి అక్కడ కూడా భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రానికి సీక్వెల్‌గా 'గట్ట కుస్తీ 2' (మట్టి కుస్తీ 2) సిద్ధమవుతోంది. జూలై 3, 2026న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలని దర్శకుడు చెల్లా అయ్యావు తాజాగా బయటపెట్టారు.

 అయ్యావు మాట్లాడుతు  ఈ సీక్వెల్ వెనుక పెద్ద కథే ఉంది. ముఖ్యంగా విష్ణు విశాల్ పట్టుబట్టడం వల్లే 'గట్ట కుస్తీ 2' సాధ్యమైంది. నిజానికి మొదటి భాగం పెద్ద హిట్ అయిన తర్వాత, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నుండి వచ్చిన ఒక రిజెక్షన్ ఈ కథని  మరో మలుపు తిప్పింది. మొదట అనుకున్న కొన్ని కథాంశాలని నెట్‌ఫ్లిక్స్ తిరస్కరించడంతో, ఈసారి మరింత పకడ్బందీగా, సరికొత్త కోణంలో భార్యాభర్తల బంధాన్ని చూపించాలని విష్ణు విశాల్, చెల్లా అయ్యావు భావించారు. మొదటి భాగం 100 శాతం మహిళల ప్రాధాన్యత, వారి సాధికారత, సమాజంలో మహిళల పట్ల ఉండే వివక్షని కామెడీ జోనర్‌లో చర్చిస్తే, ఈ రెండో భాగంలో కథ పూర్తిగా పురుషుడి కోణం నుండి సాగుతుంది. సమాజంలో స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్మే తాము, ఈసారి భార్యాభర్తల మధ్య ఉండే బాధ్యతలు, అధికారాల సమీకరణాలను సరికొత్తగా చూపించబోతున్నాను.

ఈ సీక్వెల్‌లో హీరో విష్ణు విశాల్ ఒక 'హౌస్ హస్బెండ్' (ఇంటి పనులు చూసుకునే భర్త గా  కనిపించబోతుండటం విశేషం. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారికి పవర్ వస్తుందనేది జగమెరిగిన సత్యం. అది పురుషుడైనా, స్త్రీ అయినా సంపాదనను బట్టి ఇంట్లో వారి ప్రభావం మారుతుంది. అయితే ఆ పవర్ అనేది ఇతరులను తక్కువ చేయడానికి కాకుండా, కుటుంబం పట్ల ఉన్న బాధ్యత నుండి ఎలా పుడుతుందనే కోణాన్ని ఈ సినిమాలో కామెడీగా, ఎమోషనల్‌గా చూపించనున్నాము. కేవలం పురుషులపై జోకులు వేయడం ఈ సినిమా ఉద్దేశం కాదని, ఇద్దరి మధ్య ఉండే నిజమైన బంధాన్ని, బాధ్యతను ఆవిష్కరించడమే ఈ స్క్రిప్ట్ యొక్క అసలు రహస్యం అని దర్శకుడు తెలిపారు.

Also read: vijay deverakonda: విజయ్ దేవరకొండకి బిగ్ షాక్.. టీజీ20 లీగ్‌ చుట్టూ క్రిమినల్, సివిల్ వివాదం


సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు కూడా చేరడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే కరుణాస్, కాళీ వెంకట్, మునిష్కాంత్, గజరాజ్, కరుణాకరన్ వంటి ప్రముఖ తారాగణం ఈ సీక్వెల్‌లో కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎమ్. భాస్కరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, షాన్ రోల్డాన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ మరియు విష్ణు విశాల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్‌ను ఒక సవాల్‌గా తీసుకుని, మరింత పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం కంటే పెద్ద హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.