![]() |
![]() |

థియేటర్స్ ద్వారా 'సినిమా'(Cinema)అనేది ఎలా అయితే ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తుందో, ఓటిటి(Ott)వేదికగా కూడా అంతే వినోదాన్ని అందిస్తుంది. ఇందుకు ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి.. అలాంటి ఒక వేదికే ఈటీవీ గ్రూప్ సంస్థల నుంచి వచ్చిన 'ఈటీవీ విన్'(Etv Win). లెజండ్రీ పర్సన్ రామోజీరావు(Ramoji rao)గారి నేతృత్వంలో 2019 లో ప్రారంభమైన ఈటీవీ విన్ పలు కొత్త, పాత చిత్రాలని స్ట్రీమింగ్ కి ఉంచుతు కావాల్సినంత సినీ వినోదాన్ని అందిస్తుంది.
'ఈటీవీ విన్' సబ్ స్క్రిప్షన్ రేట్ 99 రూపాయిలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈటీవీ గ్రూప్ ప్రారంభించి 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పుడు ఆ రేట్ ని 29 రూపాయలకే అందుబాటులోకి తెస్తుంది. సదరు రేటు ఈ నెల 23 నుంచి 29 వరకు మాత్రమే ఉండనుంది. ఏడాది ప్రీమియం ప్లాన్, 499 రూపాయలు. ప్రీమియం ప్లస్ ప్లాన్ 699 రూపాయలు యధావిధిగా ఉండనున్నాయి.
ప్రస్తుతం ఈటీవీ విన్ లో రీసెంట్ గా విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam)తో పాటు ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలి, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన పలు చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈటీవీ ద్వారా వచ్చిన ఎన్నో సీరియల్స్, ప్రోగ్రామ్స్ ని కూడా స్ట్రీమింగ్ కి ఉంచారు.
![]() |
![]() |