![]() |
![]() |
.jpg)
`బుట్టబొమ్మ` పూజా హెగ్డేకి సంక్రాంతి సీజన్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన `అల వైకుంఠపురములో`(2020) చిత్రం ఇదే సీజన్ లో విడుదలైంది. కట్ చేస్తే.. రెండేళ్ళ తరువాత అదే పొంగల్ సీజన్ లో రెండు బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో పలకరించేందుకు సిద్ధమవుతోందీ అమ్మడు.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటించిన తొలి చిత్రం `రాధే శ్యామ్` 2022 జనవరి 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. పిరియడ్ లవ్ సాగాగా తెరకెక్కిన ఈ సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనుంది మిస్ హెగ్డే. ఇక కోలీవుడ్ దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న తమిళ సినిమా `బీస్ట్` కూడా అదే పొంగల్ సీజన్ లో సందడి చేయనుందని సమాచారం. సో.. 2022 పొంగల్ సీజన్ లో పూజా హెగ్డే డబుల్ ధమాకా ఉండబోతోందన్నమాట. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో 2022 సంక్రాంతికి పూజా హెగ్డే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
కాగా, పూజా హెగ్డే నటించిన తాజా చిత్రాలు `ఆచార్య`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` ఇదే ఏడాదిలో తెరపైకి రాబోతున్నాయి. అలాగే హిందీనాట `భాయీజాన్`, `సర్కస్` చిత్రాల్లోనూ ఈ ముద్దుగుమ్మ నాయికగా నటిస్తోంది.
![]() |
![]() |