Home  »  News  »  రవితేజతో ముచ్చటగా మూడో సారి జత కడుతున్న భామ!

Updated : Jul 20, 2026


మాస్ మహారాజ రవితేజ(Raviteja)ప్రస్తుతం ఇరుముడి(irumudi)తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 21 న విడుదలవుతుండగా ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత రవితేజ  సరిపోదా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు.

ఈ  చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ జోడీ నుంచి రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం ఇదే అవుతుంది.  గతంలో రవితేజ, డింపుల్ హయతి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఖిలాడి' (2022) చిత్రంలో వీరు మొదటిసారి కలిసి నటించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో డింపుల్ తన గ్లామర్‌తో, నటనతో మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఇటీవల 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రంలో ఈ జోడీ మళ్లీ అలరించింది. ఈ కామెడీ డ్రామా చిత్రంలో డింపుల్ పోషించిన 'బాలామణి' పాత్ర, అలాగే మాస్ మహారాజాతో కలిసి ఆమె వేసిన స్టెప్పులు, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో భారీ విజయాలు సాధించకపోయినా, ఈ జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సూపర్ హిట్ అనిపించుకుంది.  

ఈ సరికొత్త ప్రాజెక్ట్  డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో ఉండబోతోందని సమాచారం. విభిన్నమైన కథాంశాలతో, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో మెప్పించే వివేక్ ఆత్రేయ.. మాస్ మహారాజా కోసం ఒక పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారట. ఈ కథలో హీరోయిన్ పాత్రకు గ్లామర్‌తో పాటు నటనకు చాలా ప్రాధాన్యత ఉండటంతో, రవితేజ సరసన పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే డింపుల్ హయతినే ఫైనల్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.