![]() |
![]() |

కొంతకాలంగా సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అట్లీతో షారుఖ్ ఖాన్, సందీప్ రెడ్డి వంగాతో రణబీర్ కపూర్, మురుగదాస్ తో సల్మాన్ ఖాన్, గోపీచంద్ మలినేనితో సన్నీ డియోల్ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ (Aamir Khan) వంతు వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తో 'బృందావనం', రామ్ చరణ్ తో 'ఎవడు', మహేష్ బాబుతో 'మహర్షి'.. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ తో హిట్ సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి. అయితే ప్రజెంట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉండటంతో.. వంశీ చూపు ఇతర భాషల హీరోలపై పడింది. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ విజయ్ తో 'వారసుడు' చేశాడు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు పైడిపల్లి. ఎట్టకేలకు ఆయన కొత్త సినిమా ముహూర్తం కుదిరినట్లు సమాచారం.
అమీర్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గతేడాది వార్తలొచ్చాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తాడని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత చప్పుడు లేదు. మళ్ళీ ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 16 ఉదయం బిగ్ అనౌన్స్ మెంట్ చేయనున్నట్లు దిల్ రాజు తెలపడం ఆసక్తికరంగా మారింది. అమీర్-పైడిపల్లి కాంబోలో దిల్ రాజు భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాడని, దానిని రేపు ప్రకటించనున్నాడని వినికిడి. మరి ఈ వార్తల్లో నిజమెంతో కొన్ని గంటల్లో తేలనుంది.

![]() |
![]() |