![]() |
![]() |

-అభిమానులకి షాక్ ఇచ్చిన ధురంధర్ 2
-ఎందుకు ఇలా చేసారు
-మరి ఎప్పుడు
ధురంధర్ 2(Dhurandhar 2)తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారంటే తెలుగులో తమ అభిమాన హీరో సినిమా కోసం అయితే ఎంతగా ఎదురుచూస్తారో అంతగా. పైగా రెగ్యులర్ సినీ ధరలకే మూడుగంటల నలభై తొమ్మిది నిమిషాల ఆరు సెకన్ల నిడివి కావడంతో ధురంధర్ 2 తో ఉగాది ముందే వచ్చిందనే ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనందం ఆవిరయ్యే న్యూస్ వాళ్ళని పలకరించింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
ధురంధర్ తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ వాయిదా పడింది. సదరు వాయిదాకి టెక్నీకల్ ఇష్యు కారణమని టీం ప్రకటించింది. ఈ న్యూస్ ధురంధర్ 2 ని తెలుగులోనే చూడాలని కోరుకున్న వారికి షాక్ . టికెట్స్ బుక్ చేసిన వారికి అమౌంట్ రిఫండ్ చేశామని చెప్తున్నా ఇంకా చాలా మందికి బుక్ మై షో యాప్ లాంటి వాటి నుంచి అమౌంట్ రావాల్సి ఉంది. హిందీ లాంగ్వేజ్ లో మాత్రం యధావిధిగా షోస్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పడనున్నాయి.
Also read: UStaad Bhagath singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ!. దేఖ్ లేంగే సాలా... చూసినాము చాలా
ధురంధర్ తెలుగు అభిమానులు, మూవీ లవర్స్ అయితే టెక్నీకల్ ఇష్యుకి కారణమైన వాళ్ళని తిట్టుకుంటున్నారు. ఎవరి బాధ వాళ్ళది మరి
![]() |
![]() |