![]() |
![]() |

-రోజు రోజుకి అంచనాల్ని పెంచుకుంటున్న డ్రాగన్
-ప్రస్తుతం శర వేగంగా షూటింగ్
-రంగంలోకి దేవ కట్టా
-బాక్స్ ఆఫీస్ కి కొత్త లెక్కలు దొరికినట్లేనా!
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్'(Dragon)ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ విషయంలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న రూమర్స్ కి సైతం చెక్ పెడుతూ, రూమర్స్ నమ్మకండి, మేమే ఎవిరీ అప్ డేట్ అందిస్తామని మేకర్స్ చెప్పారంటే ఫ్యాన్స్ లో డ్రాగన్ పై ఉన్న అంచనాల రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఈ కోవలోనే తాజా అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది. సంచలన దర్శకుడు దేవకట్టా డ్రాగన్ కోసం రంగంలోకి దిగుతున్నాడు.
అవును.. డ్రాగన్ కి దేవకట్టా(Deva Katta)డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ కి దేవకట్టా పెట్టింది పేరు. కమర్షియల్ ఫ్లేవర్ ఉంటూనే సూటిగా, సుతిమెత్తగా, సమాజంలోని అన్ని వర్గాలకి చేరువయ్యేలా దేవకట్టా డైలాగ్స్ ఉంటాయి. 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. అందుకే దేవకట్టాని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. పైగా ఎన్టీఆర్ వంటి మాస్ అమ్మ మొగుడు కట్ అవుట్ కి దేవకట్టా శైలి పర్ఫెక్ట్ గా సూటవుతుంది. ఒక రకంగా ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింతగా పెంచుతాయి. మరి ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎలివేషన్ సీక్వెన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో తెలిసిందే. సదరు ఎలివేషన్ కి దేవకట్టా మార్క్ డైలాగ్స్ తోడైతే సెల్యులాయిడ్ పై మాస్ జాతర ఖాయం. మహేష్(Mahesh),రాజమౌళి(Rajamouli)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)కూడా దేవకట్టా డైలాగ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే.
డ్రాగన్ ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథా నేపథ్యం గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని, పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. అందుకే పొలిటికల్ డ్రామాను డీల్ చేయడంలో అనుభవం ఉన్న దేవకట్టాను టీమ్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ జూన్ 11 న వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
![]() |
![]() |