![]() |
![]() |

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఒక క్రేజీ రూమర్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి, ఒక ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ను డైరెక్ట్ చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఆ బిగ్ ప్రాజెక్ట్‌కు కేవలం మాటలు మాత్రమే అందిస్తున్న సదరు దర్శకుడు, ఇప్పుడు ఏకంగా కెమెరా వెనుక నిలబడి ఒక కీలక భాగాన్ని తెరకెక్కించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. దీంతో సినిమా లవర్స్ అందరి దృష్టి ఒక్కసారిగా ప్రముఖ దర్శకుడు దేవ కట్టా (Deva Katta) వైపు మళ్లింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'వారణాసి' సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటిస్తున్న 'డ్రాగన్' సినిమాకి కూడా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన డ్రాగన్ (Dragon) సినిమాలో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నారంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది.
ఈ ఘోస్ట్ డైరెక్షన్ పుకార్లపై దర్శకుడు దేవ కట్టా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గట్టి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. “నేను వేరే ఏ సినిమాకు సంబంధించి ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయడం లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. కేవలం వెబ్‌సైట్ క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం కొందరు పనిగట్టుకుని ఇలాంటి తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రకటనతో 'డ్రాగన్' సినిమా చుట్టూ అల్లుకున్న సస్పెన్స్‌కు తెరపడింది.
ప్రస్తుతం తాను చేస్తున్న పనుల గురించి చెబుతూ, తన తదుపరి సొంత సినిమా స్క్రిప్ట్ వర్క్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఎంతో బిజీగా ఉన్నట్లు దేవ కట్టా వెల్లడించారు. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కోసం రాత్రి పగలు కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌పై తనకు ఎంతో నమ్మకం, ఉత్సాహం ఉన్నాయని.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు.
ఇక తాజా క్లారిటీతో దేవ కట్టా వేరే సినిమాలకు ఘోస్ట్ డైరెక్షన్ చేస్తున్నారనే వార్తలకు పూర్తిగా బ్రేక్ పడింది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి ఇంటెన్స్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా ఫోకస్ అంతా ఇప్పుడు తన నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ వండర్ పైనే ఉందని స్పష్టమైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ క్లారిటీతో సోషల్ మీడియా డిబేట్లకు గుడ్ బై చెప్పారు.
https://x.com/devakatta/status/2065319195076907089
![]() |
![]() |