![]() |
![]() |
.webp)
నందమూరి బాలకృష్ణ(Balakrishna)వన్ మాన్ షో 'డాకు మహారాజ్'(Daku Maharaj)సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదల కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి(Chiranjeevi)తో వాల్తేరు వీరయ్య ని తెరకెక్కించి మంచి హిట్ అని అందుకున్న బాబీ(Bobby)ఈ మూవీకి దర్శకుడు కావడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా 'డాకు మహారాజ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal)శ్రద్ధ శ్రీనాధ్(Shraddha Srinath)లు జత కట్టారు.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం అనంతపురంలో జరగాల్సి ఉంది.ముఖ్య అతిధిగా ఐటి శాఖా మంత్రి మంగళగిరి ఎంఎల్ఏ నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరు అవుతున్నారని అధికారకంగా ప్రకటించారు.పైగా బాలయ్యకి ఎన్నికల అనంతరం అనంతపురంలో నిర్వహిస్తున్న తొలి సినిమా ఈవెంట్ కావడంతో మూవీని నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చూన్‌ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ లు అనంతపురం లో భారీగా ఏర్పాట్లు కూడా చేసారు.కానీ నిన్న తిరుపతి లో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి టోకెన్ల కోసం వేచి ఉన్న భక్తుల మధ్య తొక్కి సలాట జరిగి పది మంది దాకా మరణించడంతో పాటు మరికొంత మంది గాయాలపాలవ్వడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కాన్సిల్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
![]() |
![]() |