![]() |
![]() |

టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన, ఇటీవల 'డెకాయిట్' (Dacoit) అనే రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో అలరించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన మంచి స్పందననే సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'డెకాయిట్' సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా మే 8 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మంచి స్పందన లభించిన ఈ చిత్రం, నాలుగు వారాలకే ఓటీటీలో అలరించనుంది.
కథా నేపథ్యం:
ఈ సినిమా కథ హరిదాస్ (అడివి శేష్) చుట్టూ తిరుగుతుంది. ఒక హత్య కేసులో 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన హరిదాస్, కడప జైలు నుంచి మరో చోటికి మారుస్తున్న సమయంలో తప్పించుకుంటాడు. తనను జైలు పాలు చేసిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలని హరి నిర్ణయించుకుంటాడు. అయితే ఆమెను కలిశాక హరిదాస్‌కు ఊహించని విషయాలు తెలుస్తాయి. అసలు వారిద్దరూ ఎందుకు విడిపోయారు? హరిదాస్ తన పగను తీర్చుకున్నాడా? లేదా అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
యాక్షన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ 'డెకాయిట్' సినిమాకు షానియల్ డియో దర్శకుడు. షానియల్ డియోతో కలిసి అడివి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించారు. అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, వైభవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయిన వారు మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
![]() |
![]() |