Home  »  News  »  Couple Friendly: ఓటిటిలోకి కపుల్ ఫ్రెండ్లీ.. డేట్ ఎప్పుడో తెలిస్తే షాక్ అవుతారు

Updated : Mar 11, 2026


-థియేటర్స్ లో అదరగొట్టిన కపుల్ ఫ్రెండ్లీ 
-ఇప్పుడు ఓటిటి లోకి 
-ప్రభాస్ మెచ్చిన సినిమా
-ఓటిటి డేట్ ఎప్పుడు! 


పెళ్లి కానీ యువతీ యువకులు ఒకే ఇంట్లో కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్నంత మాత్రాన తప్పుగా అనుకోకూడదు. వారి మనసులు ప్రేమకే ప్రేమని నేర్పేంత గొప్పవి కావచ్చు. ఆ ప్రేమ ముందు మరణం కూడా చాలా చిన్నదని నిరూపించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ(Couple Friendly). రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సైతం ఎంతో బిజీలో ఉండి తనే స్వయంగా కపుల్ ఫ్రెండ్స్ ని  పిలిపించుకొని మరి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు'కపుల్ ఫ్రెండ్లీని చూడమని కూడా ప్రేక్షకులకి చెప్పాడు. దీన్ని బట్టి 'కపుల్ ఫ్రెండ్లీ  కథ, కథనంకి ఉన్నస్పెషాలిటీని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ ఒక కొత్త గుడ్ న్యూస్ ని తన వెంట మోసుకుంటు సోషల్ మీడియా వేదికగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం.

కపుల్ ఫ్రెండ్లీ ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కి సిద్దమయ్యింది. ఈ మేరకు ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనున్నట్టు అధికార ప్రకటన వచ్చేసింది. మరి ఈ లెక్కన మూవీ లవర్స్ తో పాటు ఓటిటి లవర్స్ లో సరికొత్త పండగ వచ్చినట్టే. తెలుగుతో పాటు తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కపుల్ ఫ్రెండ్స్ గా సంతోష్ శోభన్(Santosh Sobhan),మానస వారణాసి(Manasa Varanasi)కనిపించారు. మూవీలో ఈ ఇద్దరి స్క్రీన్ అప్పిరియిన్స్ చాలా బాగుండంతో పాటు శివ, మిత్ర అనే క్యారెక్టర్స్ లో పోటా పోటీగా పెర్ఫార్మ్ చేసారు. ప్రేమ సన్నివేశాలు ఎంతగా హృదయాన్ని తాకుతాయో అదే సమయంలో భావోద్వేగాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా కథనం సాగడం 'కపుల్ ఫ్రెండ్లీ స్పెషాలిటీ.  ఎంజాయ్ ది'కపుల్ ఫ్రెండ్లీ  షో.

Also read: Ntr: ఎన్టీఆర్ పై అనసూయ పోస్ట్.. టాప్ 1 గా నిలుస్తుందా!

పూర్తిగా చెన్నై సిటీలో చిత్రీకరించిన'కపుల్ ఫ్రెండ్లీకి అశ్విన్ చంద్రశేఖర్ (Ashwin chandrasekar)దర్శకుడు కాగా అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో అజయ్ కుమార్ రాజు నిర్మించాడు. రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. ఫిబ్రవరి 14 న థియేటర్స్ లో అడుగుపెట్టింది.     .

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.