![]() |
![]() |

కాస్ట్ కటింగ్... కాస్ట్ కటింగ్... నిన్న మొన్నటి వరకు మల్టినేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద సంస్థల్లో ఇటువంటి పదాలు వినిపించేవి. వ్యాపారంలో లాభాలు తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకోవడం కోసం కాస్ట్ కటింగ్ వైపు చూస్తారు. ఇప్పుడీ పదం టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వినబడుతోంది. ఖర్చు తగ్గించే మార్గాలను వెతకడం ప్రారంభించారు. ఇంతకు మున్జడు బడ్జెట్లు తగ్గించడం కోసం పబ్లిసిటీ కోసం మీడియాకి ఇచ్చే యాడ్స్ కట్ చేసేవారు. ఛోటా మోటా ఆర్టిస్టులకు తక్కువ పేమెంట్లు ఇచ్చేవారు. ఎన్ని రోజులు అలా చేసిన ప్రయోజనం లేదని కరోనా కళ్లకు కట్టినట్టు చూపించింది. ఈ ఖాళీ సమయంలో అసలు లెక్కలు చూసుకుంటే... సినిమా బడ్జెట్లో సగం డబ్బులు హీరో, డైరెక్టర్, మెయిన్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లకు పోతోంది.
తెలుగులో టాప్ హీరోల రెమ్యూనరేషన్ దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయలకు చేరింది. మరి, ఆ హీరోలను రేటు తగ్గించుకోమని నిర్మాతలు అడుగుతారా? అంత ధైర్యం చేస్తారా? అనేది చూడాలి. ఒక నిర్మాత తక్కువ ఇస్తానంటే, సాధారణంగా తీసుకొనే డబ్బు కంటే కోటి ఎక్కువ ఇచ్చి డేట్స్ దక్కించుకోవాలని ప్రయత్నించే నిర్మాతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. హీరోలు, టాప్ డైరెక్టర్లు, 15-20 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నవారు పాతిక శాతమైనా తగ్గించుకుంటే బావుంటుందనీ, నిర్మాతలు బతుకుతారని ఆఫ్ ద రికార్డు ఒక నిర్మాత అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
![]() |
![]() |