![]() |
![]() |

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకుడు. 'బేబీ' ఫేమ్ సాయి రాజేష్ కథ అందించారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ జులై 24న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'చెన్నై లవ్ స్టోరీ' మూవీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో, యూత్‌ని అమితంగా ఆకట్టుకుంది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, బిగ్ హిట్‌గా నిలిచింది. మొదటి ప్రేమ విఫలమైతే జీవితం అక్కడితో ఆగిపోదు, అంతకంటే గొప్ప ప్రేమ మనకోసం ఎదురుచూస్తుందనే ఒక అందమైన కాన్సెప్ట్‌ను చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు రవి నంబూరి.
సినిమా తీసి వెండితెరపై తన పేరు చూసుకోవాలనే ఆశయంతో చెన్నైకి వచ్చిన అనాథ స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం ఒదిగిపోగా.. ప్రేమించిన వ్యక్తి హ్యాండ్ ఇవ్వడంతో తీవ్రమైన మనోవేదనకు గురైన నివి పాత్రలో శ్రీ గౌరీ ప్రియ అద్భుతంగా నటించింది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం, 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ భారీ ధరకు దక్కించుకుంది. ఆగస్టు 21 నుంచి ఈ సినిమా సోనీ లివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.
Kiran Abbavaram, Sri Gouri Priya, Chennai Love Story, OTT Release
![]() |
![]() |