![]() |
![]() |

వెండితెరపై కోట్లాది మంది అభిమానుల మధ్య మెరిసిపోయే నటీనటులకు రక్షణ కల్పించడం సాధారణ విషయం కాదు. అభిమానుల తాకిడి నుండి, ఊహించని ప్రమాదాల నుండి స్టార్ హీరోలను కాపాడే బాడీగార్డ్స్ జీవితం ఎప్పుడూ కత్తిమీద సాములానే ఉంటుంది. అందుకే ఈ సెలబ్రిటీలు తమ ప్రాణాలను కాపాడే ఈ నమ్మకస్తులైన బాడీగార్డ్స్ కు ప్రతి నెలా ఇచ్చే జీతాలు వింటే సామాన్యుల కళ్ళు బైర్లు గమ్మడం ఖాయం. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో తమ బాడీగార్డ్స్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ విషయంలో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. రామ్ చరణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ఒక పెద్ద వ్యాపారవేత్త కూడా కావడం విశేషం. అందుకే ఆయన తన బాడీగార్డ్ కెవిన్(Kevin)కు ప్రతి నెలా ఏకంగా ₹70 లక్షల భారీ పారితోషికాన్ని అందిస్తున్నారు. భారతదేశంలో ఏ ఇతర టాప్ స్టార్ కూడా తమ బాడీగార్డ్స్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం లేదంటే చరణ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌ను నిరంతరం నీడలా వెంటే ఉండే బాడీగార్డ్ యువరాజ్ ఘోర్పడే నెలకు ₹16 లక్షల జీతాన్ని అందుకుంటున్నాడు. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ మరియు ఆయన నమ్మకస్తుడైన బాడీగార్డ్ షేరా బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని దశాబ్దాలుగా సల్మాన్‌కు రక్షణగా నిలుస్తున్న షేరాకు ప్రతి నెలా ₹16 లక్షల వేతనం లభిస్తోంది. అలాగే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ శ్రేయస్ థేలేకు నెలకు ₹14 లక్షలు చెల్లిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన భద్రతను పర్యవేక్షించే జితేంద్ర షిండేకు ప్రతి నెలా ₹13 లక్షల జీతాన్ని ఇస్తున్నారు.
ఇదే క్రమంలో కోలీవుడ్ దళపతి విజయ్ తన బాడీగార్డ్ నయీమ్ మూసాకు ప్రతి నెలా ₹13 లక్షల వేతనం అందిస్తూ రక్షణ కల్పించుకుంటున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఎల్లప్పుడూ అండగా ఉండే రవి సింగ్ ప్రతి నెలా ₹12 లక్షల భారీ జీతాన్ని పొందుతున్నాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బాడీగార్డ్ రమేష్ చెరుకుకు నెలకు ₹12 లక్షలు చెల్లిస్తున్నారు. మరోవైపు కన్నడ రాకింగ్ స్టార్ యష్ తన బాడీగార్డ్ శ్రీనివాస్ కోసం నెలకు ₹9 లక్షలు కేటాయిస్తున్నారు.
బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొనే తన బాడీగార్డ్ జలాల్‌ను సొంత సోదరుడిలా భావిస్తుంది. ప్రతి ఏటా రాఖీ కట్టే జలాల్‌కు దీపిక నెలకు ₹10 లక్షల శాలరీ ఇస్తోంది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన బాడీగార్డ్ మయూర్ శెట్టికి నెలకు ₹7 లక్షలు, అలియా భట్ తన బాడీగార్డ్ యూసుఫ్‌కు నెలకు ₹7 లక్షలు మరియు కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ దీపక్ సింగ్‌కు నెలకు ₹6 లక్షల చొప్పున జీతాలు ఇస్తున్నారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వంటి మరికొందరు బిగ్ స్టార్స్ మాత్రం పర్సనల్ బాడీగార్డ్స్ ఉంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరని ఇండస్ట్రీ టాక్.
![]() |
![]() |