![]() |
![]() |

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో పూసల దండలు అమ్ముకుంటున్న మోనాలిసా(Mona lisa)ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కాటుక పెట్టిన తేనె కళ్లు,డస్కీ స్కీన్,సింపుల్ హెయిర్ స్టైల్,అందమైన చిరునవ్వు, చూడగానే కట్టిపడేసే అందంతో మహాకుంభమేళాకు వచ్చిన వాళ్ళతో పాటు,సోషల్ మీడియా ప్రేమికులని మంత్రముగ్దులని చేస్తుంది.దీంతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిందని చెప్పవచ్చు.
రీసెంట్ గా మోనాలిసా గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా(Sanoj Mishra)మాట్లాడుతు మోనాలిసా రూపం,ఆమె అమాయకత్వాన్ని చూసి ఫిదా అయ్యాను.త్వరలోనే నేను తెరకెక్కిచబోయే 'డైరీ ఆఫ్ మణిపూర్' చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను.రైతు కూతురు క్యారక్టర్ కోసం మోనాలిసా లాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నాను.తను పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి మోనాలిసాని కలుస్తాను.ఆమెకి యాక్టింగ్ రాకపోతే నేర్పిస్తానని చెప్పుకొచ్చాడు.గాంధీ గిరి,ది డే ఆఫ్ బెంగాల్, కాశీ టూ కాశ్మీర్,రామ్ కీ జన్మ భూమి వంటి పలు చిత్రాలు సనోజ్ మిశ్రా దర్శకత్వంలో వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.

ఇక డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగ్రేటం చేస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇదే కనుక నిజమయ్యి ఆ మూవీలో మోనాలిసా చెయ్యడం ఖాయమైతే మోనాలిసా దశ తిరిగినట్టే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మోనాలిసా స్వస్థలం.
![]() |
![]() |