![]() |
![]() |

-నిన్న థియేటర్స్ లోకి ల్యాండ్
-టాక్ పర్లేదు
-మరి తొలి రోజు కలెక్షన్స్ విన్నర్ ఎవరు
శుక్రవారం శోభని అందివ్వడంలో తెలుగు సినిమా తమ హామీని మరవడం జరగని పని అంటు నిన్న సెల్యులాయిడ్ పై బైకర్(Biker),రాకాస(Rakasa)అడుగుపెట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులతో సినీ మోములుని నింపుకొని కళకళలాడుతున్నాయి. రెండు చిత్రాలకి పర్వాలేదనే టాక్ కూడా రావడంతో సమ్మర్ తనని ఏం చెయ్యలేదనే ధీమాతో తెలుగు సినిమా ఉంది. మరి తొలి రోజు ఆ రెండు చిత్రాలు సాధించిన కలెక్షన్స్ ని చూద్దాం.
ముందుగా బైకర్ కలెక్షన్స్ ని చూసుకుంటే తొలి రోజు 2 .41 కోట్ల రూపాయిలు సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నెట్ పరంగా చూసుకుంటే 2 .10 కోట్లు. తెలుగులో 1850 షోస్ ప్రదర్శించగా ఆక్యుపెన్స్ పరంగా ట్వంటీ పర్శంట్ అని తెలుస్తుంది. బైకర్ లో తమిళ వాసనలు ఉండటంతో అక్కడ కూడా రిలీజ్ చేయగా 183 షోస్ తో 5 లక్షలు దక్కించుకున్నట్టుగా టాక్ .మరి చిత్ర బృందం నుంచి కలెక్షన్స్ పై అధికార పోస్టర్ రిలీజ్ చెయ్యాల్సి ఉంది. తండ్రి, కొడుకు సెంటిమెంట్ కి బైక్ రేసింగ్ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించగా శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్ కీలక రోల్స్ .అభిలాష్ రెడ్డి(Abhilash Reddy)దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించింది.
also read: రష్మిక అంటే పేరు కాదు బ్రాండ్.. రాయలసీమ ఫీలింగ్ ఉందని అర్ధమవుతుంది
మరి రాకాస ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే తొలి రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించినట్టుగా తెలుస్తుంది. స్టార్స్ లేకుండా ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించడమంటే చిత్రానికి లభిస్తున్న అదరణని అర్ధం చేసుకోవచ్చు. హర్రర్ కామెడీ కావడంతో ఓవర్ సీస్ లో రిలీజ్ చేయగా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరి తొలి రోజు కలెక్షన్స్ పై మేకర్స్ అధికార పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూద్దాం.సంగీత్ శోభన్, నయన్ సారిక , గెటప్ శ్రీను ముఖ్యమైన క్యారెక్టర్స్ లో చేయగా నీహారిక కొణిదెల నిర్మించింది. మానస శర్మ(Manasa sharma)దర్శకురాలు.
![]() |
![]() |