Home  »  News  »  Best OTT Movies Telugu: థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. ఓటీటీలో అదరగొడుతున్న టాప్ 10 సినిమాలు ఇవే!

Updated : Apr 11, 2026

  • మస్ట్ వాచ్ తెలుగు సినిమాల లిస్ట్
  • ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రేజీ మూవీస్
  • థ్రిల్లర్ ప్రియులకు ఈ వారం పండగే

ఈ వారం థియేటర్ కు వెళ్లడం కుదరలేదా? ఇంట్లోనే కూర్చుని మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కొన్ని అదిరిపోయే సినిమాల లిస్ట్ సిద్ధంగా ఉంది. కామెడీ, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ 10 సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

తాయ్ కిళవి: (Thaai Kizhavi)
మొదటగా రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'తాయ్ కిళవి' గురించి చెప్పుకోవాలి. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఊర్లో వడ్డీ వ్యాపారం చేస్తూ కరుకుగా ఉండే ఓ బామ్మ చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె దగ్గర నిధి ఉందన్న ప్రచారంతో కొడుకులు చేసే హడావిడి, అందులోని కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. జియో హాట్‌స్టార్ లో ఇది స్ట్రీమ్ అవుతోంది.

వధ్ 2: (Vadh 2)
సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి 'వధ్ 2' మూవీ మంచి ఆప్షన్. జైలు నేపథ్యంలో సాగే 'వధ్ 2' మూవీలో సస్పెన్స్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 

ధీరం: (Dheeram)
ఇక ఇంద్రజిత్ సుకుమారన్ నటించిన 'ధీరం'.. ఒక సైకో కిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని అస్సలు డిజప్పాయింట్ చేయదు.

వలతు వశతే కల్లన్: (Valathu Vashathe Kallan)
మలయాళ సినిమాలకు ఓటీటీలో క్రేజ్ మామూలుగా ఉండదు. 'దృశ్యం' ఫేమ్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మలయాళం మూవీ 'వలతు వశతే కల్లన్'. ఇది క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా. కూతురు మిస్సైన తండ్రి ఆవేదన, ఆ వెనక ఉన్న కుట్రలను ఛేదించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

ది అగ్లీ: (The Ugly)
అలాగే 'ది అగ్లీ' అనే కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. 40 ఏళ్ల క్రితం కనుమరుగైన తల్లి మిస్టరీని ఛేదించే కొడుకు కథ ఇది.

నిలవే: (Nilave)
బోల్డ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి 'నిలవే' ఒక మంచి ఆప్షన్. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా డీప్ లవ్ అండ్ ఎమోషన్స్‌తో సాగుతుంది. 

కాసర్గడ్ ఎంబసీ: (Kasaragod Embassy)
ఇక సిరీస్ ప్రియుల కోసం జీ5 లో 'కాసర్గడ్ ఎంబసీ' అనే ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉంది. ఫేక్ సర్టిఫికేట్ల స్కామ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది.

అదర్స్: (Others)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోన్న మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ 'అదర్స్'. నగరంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, అలాగే ఐవీఎఫ్ (IVF) ద్వారా జన్మించిన శిశువులకు వస్తున్న వింత ఆరోగ్య సమస్యల వెనుక ఉన్న నిజాన్ని ఛేదించే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. 

సైలెన్స్ 2: (Silence 2)
మనోజ్ బాజ్‌పాయ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ 'సైలెన్స్ 2'. షూటౌట్స్, మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ట్విస్ట్ లు అదిరిపోతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్. ఇది జీ5 లో స్ట్రీమ్ అవుతోంది. 

సరస్వతి: (Saraswathi)
వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియమణి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'సరస్వతి'. దీనికి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించడం విశేషం. మిస్ అయిన కూతురి కోసం ఓ తల్లి చేసే పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది ఈ సినిమా. ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఓవరాల్‌గా ఈ వీకెండ్ వినోదానికి ఈ పది సినిమాలు పక్కా గ్యారంటీ ఇస్తున్నాయి. మీ టేస్ట్‌ను బట్టి ఈ లిస్ట్‌లో ఉన్న సినిమాను ఎంచుకుని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులకు ఈ వీకెండ్ పండగే అని చెప్పాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.